ఈ పోస్ట్ రాయడానికి నేను ముమ్మాటికి అర్హుడను కాను ...మా క్లాసు ఫ్రెండ్ పెళ్లి ఫోటో లు పేస్ బుక్ లో చూసినపుడు నా మనసులో మాటను కొందరికైనా తెలియాలని మరియు ఈ సంస్కృతి మీద ప్రేమ తో రాస్తున్నాను .
అప్పటి కాలం లో పెళ్లి ఎలా జరిగేది ? అని మా నానమ్మ కి అడిగాను మా అక్కయ్య పెళ్లి అయినతరువాత ... మా నానమ్మ పెళ్లి 15 రోజులు జరిగిందని , ఆ 15 రోజులు ల గురించి వివరంగా చెప్పింది ..... ఇ ప్పుడు వున్నా ఈ బిజీ ప్రపంచంలో 2 రోజులు జరిగిందంటే అదే చాలా ఎక్కువ అనుకుంటున్నాము ... ఆ రెండు రోజుల్లో ఏ గొడవ కాకుంటే చాలురా దేవుడా అనుకున్ట్టున్నాము ....
పాత కాలం లా 15 రోజులు పెళ్లి చేసుకోవడానికి మన దగ్గర అంత సమయం లేకపోవచ్చు లేక అంత ఓపిక లేకపోవచ్చు ... కానీ జరగబోయే కార్యం పద్ధతి గా జరుపుకుందాం ....
ఇప్పటి పెళ్లి కొడుకు - పెళ్లి కూతురు ... ముహూర్తాలు చాదస్తాలండి అంటున్నారు ( ముక్యం గా చదువు కున్నవారు ) ... అస్సలు ముహూర్తాలు ఎందుకు పెడతారో? ... నక్షత్రాలు ( జాతకాలు ) ఎందుకు చూడాలి అని ఎదురు ప్రశ్న ఒకటి పెద్దల మోహన పడేస్తారు ...జీల కర్ర - బెల్లం , తాళి , తలంబ్రాలు , ఇలా ప్రతి గట్టం గురించి పెళ్ళికి ముందే తెలిసి వుండాలి...
.., ముహూర్త సమయానికి వారి ఇద్దరి నక్షత్రాలకి మనస్సులు ఏకీకృతం అయ్యే అవకాశం వస్తుంది ( from astrology ) , ఇంకా జీలకర బెల్లం కలిపి బాగా నూరి అరచేతిలో పెట్టుకొని అవతలి వారి తల ( మెదడు నరం ) ఒకరికి ఒకరు పట్టుకున్నపుడు విధ్య్తయస్కంత శక్తి వల్ల ( from electro- magnetic theory einstein ) మనం మనసులో ఏమనుకుంటామో అది మనం చనిపోయేంత వారికీ ఎప్పటికి గుర్తుకొస్తూనే వుంటుంది . ఆ సమయం లో చెప్పే మంత్రాలని శ్రద్ధ గా విని పంతులు చెప్పినట్లుగా చెబితే అపుడు నీ మనసులో ఆ మాటలు ఒక శీలా మేధ రాతలా వుండి పోతాయి .. తరువాత దాంపత్య జీవితము లో గొడవలు రాకుండా వుంటుంది ....
కాని ఇప్పటి పెళ్ళిలలో జీల కర్ర - బెల్లం పెట్టినపుడు కుడా కామెరా వైపు చూస్తున్నారు ... ఆ సమయం లో పంతులు చెప్పే మాటలకి కాని , మనసులో దృడం గా ఒక మాట కాని అనుకోవడం లేదు , ఇంకా ఎలాగా కలుస్తాయి వారి మనసులు ??/.
ఇంకా తలంబ్రాలు పోసుకొనే విషయానికి వస్తే , ముత్యాలు పగడాలు కలిపినా పసుపు బియ్యాన్ని ఒకరి మీద ఒకరు మూడు సార్లు పోసుకుంటారు .. ఈ సమయం లో పురోహితుదు , సంతానబివ్రుద్ధి పశుసంరుద్ధి మాగన సమృద్ధి అంటూ ఆశిర్వదిస్తాడు .. సరిగ్గా అదే సమయం లో ముక్కోటి దేవతలు వచ్చి వధువరులను ఆశీర్వదిస్తారు ... ఆ సమయంలో కూడా ఇ లా ఫోటో ఫోజు కోసమని చేయి ఇ లా పెట్టి , అలా పెట్టి ఆడుకోవడం ధీని వాళ్ళ ముక్కోటి దేవతల అశేషులు పొందలేకపోతున్నారు ...మాంగళ్యం కట్టేతపుడు కూడా ఇదే వరస ... అందుకీ ఇప్పుడు సమాజం లో విడాకులు లక్షలాది గా పెరిగి పోయాయి ...
ఫోతోగ్రఫెర్ ప్రతిదానికి ఇటు చుడండి , ఒక్క నిముషం మరొక్కసారి అని చెప్పి అతను ఫొటోస్ తెస్తూనే వుంటాడు ... ఎందుకంటే తరువాత ఫొటోస్ బాగా రాలేదనుకో తనని నిందిస్తారని , కాబ్బట్టి అతని బయం అతనికి , అయిన ఇ పుడు ప్రతేకం గా ఫొటోస్ కోసమని ఒక సిస్టం పెట్టుకొన్నాము గా అదే రిసెప్షన్ ... ఏ ఫోజు లో కావాలంటే ఆ ఫోజులో దిగ్గచ్చుగా.....
అప్పటిలో బార్య బార్త ఇద్దరు సర్దుకో పోయి సంతోషం గా వుండే వారు ... అందుకే అపుడు విడాకులు అన్న మాట లేదు ... బార్య తప్పు చేస్తే వుద్ధరించుకునే వాడు బార్త ... అంతే కానీ ఈ వంట బాగాలేదు ఇది బాగాలేదు అనే వాడు కాదు భర్త ... కానీ ఇ పుడు ఎవరి వక్తిత్వం వారిది , సర్దుకు పోదాం అనే ఆలోచన తగ్గింది అందుకే ఇపుడు విడాకుల సంఖ్య దారుణంగా పెరిగిపోయింది .....
పెళ్లి ఒక పద్ధతి గా శుబం కలిగే విధం గా జరుపోకొనే లా ఆలోచించండి .. ఫోతోగ్రఫేర్ కి ముందే చెప్పండి , పెళ్లి జరిగేటప్పుడు దిస్త్రుబ్ ( disturb ) చేయద్దని , ఫొటోస్ ఎలా వస్తే అలానే తీయమని .. అవసరమైతే ఫొటోస్ తి యకపోయినా పరవాలేదని చెప్పండి .... ఆలోచించండి .....