పేజీలు

11, ఫిబ్రవరి 2012, శనివారం

కొబ్బరికాయ






మాఇంట్లో  ప్రతి మంగళవారం మా అమ్మానాన్నలు చెరొక కొబ్బరికాయ ని గుడిలో కొడుతుంటారు .. అందులో సగం ఇంటికి తెస్తారు సగం గుడిలో దేవుడికి వదిలేస్తారు …నేను స్కూల్  నుంచి రాగానే  షుగర్  తో కలిపి ఆ సగం కొబ్బరికయని  తినేవాన్ని  ….  అలా అపుడప్పుడు నాతో కూడా కొబ్బరికయని కొట్టించేవారు  … అపుడు నేను చాలా గర్వంగా  feel అయ్యేవాణ్ణి  … ఆ కొబ్బరికాయ ని నేను అందరికి పంచేవాన్ని  ….  నేను  8th క్లాసు  లో  వున్నపుడు మా నాన్నగారు ఒకసారి  city కి తెసుకువెళ్లారు  అపుడు టిఫిన్ చేయడానికి ఉడిపి  హోటల్  కి తెసుకు వెళ్లారు .. ఆర్డర్  చేసిన ఇడ్లి అందులో ను పుట్ట్నాలు మరియు కొబ్బరి చేత్న్ని రాగానే గబగబా తినడం  స్టార్ట్  చేశా … అంతయ్యాక బయటకి వస్తుంటే  .. మాకు ఎదురు పడుతూ ఒకతను సంచి నిండుగా కొబ్బరి తెసుకొని హోటల్   లోపలి కి  వస్తున్నాడు  … అపుడే మా నాన్న గారిని అడిగాను ఈ కొబ్బరి అంత ఎక్కడి నుంచి తెసుకొని వస్తారని  ???? చిన్నా..!!! ఈ కొబ్బరి అంత పక్కనే వున్నా దేవాలయం నుంచి తిసుకోస్తారని  చెప్పారు  … అంటే మిగతా సగం కొబ్బరి కాయలు ఇలా హోటల్  లో  అమ్మేస్త్రారని తెలుసుకొన్నాను ….
అలా  ఎపుడు గుడికి వెళ్ళిన కొబ్బరికాయ కొట్టేవాడిని  … నేను   ఇంటర్మీడియట్  చదువుతున్నపుడు ఒకసారి వేయీ స్థంబాల గుడికి వెళ్లి దేవుడిని దర్శ్హనం చేసుకొని అక్కడ కూడా కొబ్బరికాయ  కొట్టి బయటకి వస్తువున్నాను  …. అక్కడే ఒక పండు ముసలి వయసులో వున్నా ఒక ఆవిడ బిక్షాటన చేస్తుంది  …చూడటానికి చాలా ఆకలి మీదా వున్నట్టు కనిపించింది  …. నానా  దానం చెయి  నానా మీ తల్లిదండ్రులను  ఆ  దేవుడు చల్లగా చూస్తాడు అని అన్నది  … నా దగ్గర వున్నా ఒక రుపాయీ ఇచ్చాను … చల్లగా వుండు  నానా  అంది  … అపుడు ఆ అమ్మ మొహం  లో  కొంచం ఆనందాన్ని గమనిచాను …. ఇంటికి వచ్చి ఎప్పటి  లా గే కొబ్బరికయని  షుగర్  తో కలుపుతున్నాను … కాని నా ఆలోచనంత ఆ బిక్షాటన చేసే అమ్మ మీదే …. ఈ కొబ్బరికాయ  కోట్టకుంటే కనీసం ఇంకో రెండు రూపాయలు అయిన  ఇచేవాడిని అని అనుకున్నాను …..
అప్పుడు నాకు ఒక సందేహం కలిగింది అస్సలు దేవుడికి కొబ్బరికాయ ఎందుకోట్టాలి  ??????పూర్వ కాలం నుంచి వస్తున్నా సంస్క్రతి  … దీనికి ఏదేని  ఒక  scientific reason వుంటుందో అనుకునే వాణ్ణి  …మా నాన్నమ్మ ని అడిగాను అపుడు గుడికి కి వెళ్ళినపుడు  కొబ్బరికాయ కొడితే మంచి ది రా అని చెప్పింది  ???ఎందుకో కొట్టాలో మాత్రం చెప్పలేదు  …. చివరికి పూజారిని అడిగాను ,... కొబ్బరికాయ ని మన మానవ head  కి సమంగా చూస్తారని  కొబ్బరికాయ   మీద  వున్నా పిచు ( fibre ) మన లో వున్నా ఆలోచనలను  , కోరికలకు సమంగా  చూస్తారు అని  కొబ్బరి లోపల  వుండే ఆ తెల్లని పదార్థం ని మన హృదయం తో సమంగా చూస్తారని ,...ఎపుడు అయితే  కొబ్బరికాయ మనం కోడతమో అపుడు ఎలాగాఎతే  పవిత్రం  గా వున్నా నీరు తో పాటు తెల్లని పదార్థం వస్తుందో .. అలాగే మనం కూడా మనలో వున్నా స్వార్ధపు  ఆలోచనలు , కోరికలను పక్కనపెట్టి ఎటువంటి మలినం లేని  పవిత్రమైన హృదయాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పడానికి , అలా అంత పవిత్రం అయింది  కనుక కొబ్బరిని ప్రసాదం గా తెసుకొంటారని చెప్పారు .ఆ పూజారి చెపిన దాంట్లో spirituval  గా బాగానే అనిపించింది కానీ scientific  గా ఏమి అనిపించలేదు.    మన కష్టాలు తిరుతాయో లేదో తేలేదు కానీ ఆ కొబ్బరికాయకు పెట్టె పది రూపాయలతో ఆ గుడి దగ్గర బిక్ష్తన చేసే,.. ఏ పని  చేయలేని  స్థితిలో వున్నా వృద్ధ వయసు వారికీ    ఆ  రోజు పూట అన్నం  లో  మన వంతు గా కొన్ని మెతుకులు ఇచ్చిన  వాళ్ళ మావుతము అనుకోనాను    … అలాగే ఆ పెద్దవాళ్ళ అశిశులు కూడా పొందుతాము … అయీన మానవసేవే మాధవసేవ  అనేకదా మనకు మన గురువులు నేర్పించింది  ….. అందుకే ఇప్పుడు కొబ్బరికాయ ను కొట్టడం మానేసాను ... నా ఆత్మలో సత్య ...!!

4 కామెంట్‌లు: