పేజీలు

9, ఏప్రిల్ 2012, సోమవారం

బంధువులు ( Relatives ) - బంధాలు





నేను ఆరవ తరగతి లో వున్నపుడు మా అక్కయ్య  పెళ్లి జరిగింది ...  మా అక్కయ్య పెళ్ళి కి  15  రోజుల ముందు నుంచే ఇల్లంతా బంధువులతో నిండి పోయింది ... రోజుకి దాదాపుగా ఒక ౩౦ - 40  మందికి ( బంధువులు / కొంత మంది ఊరిలో ) వంట చేసే వారు ... ఇంట్లో మొత్తం సందడిగా వుండేది ... 10  రోజులు కార్డ్స్ పంచడానికే పట్టేది, అది కూడా రోజు కి ఒక 8  మంది వేరే  వేరు ఊర్లకి వెళ్ళే వారు . పెళ్ళిఅయిపోయాకా ఒక 10  రోజులు బంధువులు ఇంట్లోనే వున్నారు ....నేను  పెరుగుతున్న  కొద్ది   నెమ్మదిగా బంధువులనకు దూరంగా వుండటం అలవాటయింది ..బంధుత్వాలా విలువలు ఏంటో తెలియకుండా పెరిగాను ..... ఇంక ఇపుడు  బంధువులే లేకుండా వుండే స్టేజి కి వచ్చాను  ....అత్తమ్మ ,మామయ్య  ,తాతయ్య ,అమ్మమ్మ ,బావ , చిన్నన్నా , పెద్ద నానా , ... ఈ మాటలనే మరిచిపోయాను ....


 అయిన  బంధువులతో  వుంటే ఎంత ??? లేకుంటే ఎంత ???? ముందు నా తోడ పుట్టిన  ( రక్త సంబంధం ) వారితో బంధాన్ని నిలుపు కుంటే చాలు అనుకున్నాను .... కాని నేను అనుకున్నది తప్పు అని మా అన్నయ్య పెళ్లి కి తెలిసింది ...మార్చి౨౦ ౧౨ (2012  ) లో మా అన్నయ్య పెళ్ళి అయింది , అప్పటి పెళ్ళికి ఈ ప్పటి పెళ్ళికి చాలా తేడాని గమనించాను...౭ ( 7 ) రోజుల్లో పెళ్ళి జరిగిపోయింది ... ౩(3 ) రోజుల్లో పత్రికలు పంచె యడం  .. అది కూడా ఇద్దరే వెళ్లి పంచడం ... ఎందుకంటే ఇపుడు టెక్నాలజీ బాగా  పెరిగింది కదా ... అందరికి ఫోన్ చేసే చెప్పారు ...పెళ్ళి ఇంక 2  రోజులు వున్నా ఇంట్లో చుట్టాలు లేరు .... ఇంక పెళ్ళి తరువాత 3  రోజే కే ఎవ్వరు లేకుండా అందరు వెళ్లి పోయారు...

 దీనికి  ప్రధాన కారణం మేము బంధువులను ఎక్కువగా పట్టిన్చుకోలేకపోవడమే , అలాగే పెళ్ళి ఫంక్షన్ హాల్ లో  కాబట్టి  అందరు కరెక్ట్ గా  ముహూర్తానికి వచ్చి అశేర్వదించి ...విందు చేసి గంటల్లో తిరిగి  వెళ్లి పోయారు ......

      ఇపుడు అందరు ఒక మాట వాడుతున్నారు ... బంధువులు  స్వార్థపరులు అని,   నేను కూడా అలానే నా మెదడులో బలంగా చుచ్చుకోపోయే లాగా అనుకున్నాను .... ఆ చిన్న స్వార్ధపు ఆలోచనతో  , ఈ బంధుత్వా ప్రపంచాన్ని చిన్నదిగా చేసుకోనని బ్రతికాను ..... చివరిగా నా కంటూ రక్త సంబంధం తప్ప వేరే  బంధువులే   లేకుండా వున్నాను .....నేను కూడా ఎంత స్వార్ధం గా అలోచిస్తున్ననో .....

        మన ఈ బారత దేశ సంస్క్రతి లో బంధుత్వాలకి చాల గొప్ప ఆశయం ,  నైతిక విలువతో కూడిన బావం వుంది .... డబ్బు సంపాదించడం కోసమే ఈ బారతదేశం లో వున్నాను  అని అనుకోని  బంధువులతో , సొసైటీ తో బంధాలు లేకుండా నాది నేను బ్రతికేస్తే చాలు అని అనుకుంటే .... రేపు నీ జీతం లో 2  ల క్షల నుంచి 3 ,7 , 9  L ..... అవుతుందే తప్ప ??/.... ఈ బారతదేశ సంస్క్రతి లో వుండి అర్తం లేని వాళ్ళమవుతాము ....డబ్బు సంపాదించడానికే అయెతే వేరే దేశానికి వెళ్లి సంపాదిస్తే దీనికి ఒక 5 -10  రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిం చావచ్చు ... నీ ఇన్వెస్ట్మెంట్ ఈ దేశం లో పెట్టి ఈ దేశ  ఆర్ధిక అబివృద్ధి కి కనీస  సహం చేసిన వాడివి అవుతావు ...... అలా కాకుండా నాకు నేను నా రక్త సంబంధమే అనుకుంటే  రేపు నీకు పుట్టపోయే వాడికి కూడా మనవ బంధాలు ,  నైతిక  విలువలు  తెలియకుండా పెరుగుతాడు... ... నేను చేసిన తప్పుని  సరిదిద్దుకొని ఈ బారత దేశ సంస్క్రతి లో  గర్వంగా బ్రతుకుతాను ...  నా ఆత్మ లో సత్య



2 కామెంట్‌లు:

  1. చాలా చక్కని మాట చెప్పారు! బంధువులు స్వార్ధపరులే అండీ మన అనుకున్న వాళ్ళంతా బాగుపడాలి, బాగుండాలి అన్న స్వార్ధం. మా ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా అందరూ తలో చెయ్యి వేసి పని భారాన్ని తగ్గిస్తారు. అదే కాక కష్టసుఖాల్ని పంచుకుంటూ మేము కొండంత అండగా ఉన్నాము అన్న ఆసరానిస్తారు. కాని ఈ కాలంలో చాలా మంది బంధువులే కాదు కన్న బిడ్డలకి స్వార్ధం మరీ పెరిగిపోయి కన్న తల్లిదండ్రులని కూడా పట్టించుకోవటం మానేసారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రసజ్ఞ గారు .... పోస్ట్ కి స్పందించి నందులకు ..... మీరు చెప్పినట్లు గా చాలా మంది ఈ రోజుల్లో కన్నా తల్లిదండ్రులనే కాదని వెళుతున్నారు ... అసలు ఎందుకు అలా చేస్తున్నారు ???... దీనికి ఏ పరిష్కారం లేదంటారా ...????

      తొలగించండి