పేజీలు

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

అమ్మ - ధర్మ పత్ని ( పతి ) కి కృతజ్ఞత ( Thank You )




కృతజ్ఞత ఎవరికీ చెప్పాలో ??? ఎపుడు చెప్పాలో ??? అసలు ఎందుకు చెప్పాలో కూడా తెలియని పరిస్తితులలో వుంది ఇప్పటి సమాజం ... నేను చాలా  సినిమా లో   గమనించాను ... తన  తల్లి కి , తన బార్య కి థాంక్స్  చెప్పడం ... కాఫీ ఇస్తే thank  you  అని , అమ్మ  మంచి వంటకం చేసి పెడితే thank యు  అమ్మ .. అని ఇలా... మన స్టొరీ writers చాలా  సందర్బల్ల్లో  ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని తెగ వాడుతున్నారు ....ఇలా సినిమా లలో ఎక్కువ గా చూపించిన దగ్గర నుంచి ఇపుడు  అందరు ఈ మాటను బార్య దగ్గర , తన తల్లి దగ్గర వాడుతున్నారు ... థాంక్స్ యే ... అని ....

అస్సలు అమ్మ కి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి ?????

మనళ్ళి  9  నెలలు మోసినందుకా ??? కాదు కాదు ....
మనం కడుపులో వున్నపుడు కాళ్ళతో అమ్మని తన్నినపుడు ఆ బాధ బరిన్చిన్నందు కా ??? కాదు కాదు ....
తన రక్తాన్ని పాలగా మార్చి  నీ కడుపు నిప్పినందుకా ??? కాదు కాదు ....
నీ కోసమని తను అన్నం తినకుండా నీ ఆకలి తిర్చినందుకా ??? కాదు కాదు ....
నీవు బాగా చదువుకోవాలని , తను కస్టపడి ఫైసా ఫైసా కుడపెట్టినందుకా ??? కాదు కాదు .... 
నీకు జ్వరం వస్తే తను అన్నం తినటం మానేసినందుకా ??? కాదు కాదు ....
నీకు exams  అయెతే తను నితో పాటుగా రాత్రి వరకు  ఉన్నందు కా ???? కాదు కాదు ....
నీవు పెద్దాయకా, ఉర్కోవే నేకేం తెలియదు అని ఎన్ని మాటలన్నా  ఒపికితో ఏమి అన నందులకా  ??? ..

నీకోసం తన కన్నా తల్లిదంద్రుల్లి విడిచి వచ్చినందుకా ???? కాదు కాదు ....
ఉదయం లేవగానే నివు కట్టిన మంగళసూత్రం కి దండం పెట్టుకునండుకా ??? కాదు కాదు ...
నికు నన్చిన విధం గా వుండాలని తన ఇష్టలను వదులుకున్నందు కా ??? కాదు కాదు ...
ధర్మ బద్దం గా నీ కోరికలను తెర్చినందు కా ???  కాదు కాదు ...
నీ వంశం వుద్దరించటానికి నీ లాంటి ఇంకొకరిని  తన కడుపులో మోస్తున్నందు కా ??? కాదు కాదు ....
నివు  వృధ్య ప్యాం లో వున్నపుడు నీకు సేవ చేసినందు కా ???

దేనికి చేభుతావు కృతజ్ఞత  .... ?????? మనం చెప్పే కృతజ్ఞత సరిపోతుందా అసలు ???  ఒక వేళ  కృతజ్ఞత చెప్పాలనుకుంటే నివు  బ్రతికి వున్నా ప్రతి sec కి ఒకసారి కృతజ్ఞత చెప్పల్సివుంటుంది ... మన అమ్మ కి, బార్య కి కృతజ్ఞత  తో సరితుల్చలేము .... అస్సలు ఈ లోకం లో అతుల్యం అయినది అమ్మ ప్రేమ ఒక్కటే ..... సంస్కారం వున్నవారు ఇలా తన తల్లి కి , తన బార్య కి  ఏ విషయం లో కూడా   కృతజ్ఞత ( thank  you ) చెప్పా కూడదు ..... నా ఆత్మలో సత్య 


 
  
  
 

20, ఫిబ్రవరి 2012, సోమవారం

గురువు






గురువులకు మన తల్లిదండ్రుల తరువాత స్థానం ( place  )  ఇచ్చే మన ఈ గొప్ప సంస్కృతి కలిగిన బారత  దేశం లో  12  feb రోజున ఒక విద్యార్ధి తన గురువు ని చంపడం చాలా బాదించే విషయం , గురుర్బ్ర్హమా  గురుర్విశ్నుహు ... గురుర్దఎవొఅ  మహేఅస్వరః .... గురు  స్సాక్షాత్పర  బ్రహ్మ తస్మై  శ్రీ  గురవేనమః గురువు   బ్రహ్మః విష్ణువు ,మహేశ్వరుడు  ముగ్గురితో సమానమైన వారిగా పోల్చే మన సంస్క్రతి , మన మానవ విలువలు ఎందుకు ఇలా దిగాజరుతున్నాయీ ????...

మా చిన్నపుడు మాకు గురువులు  అంటే భక్తి  తో పాటుగా భయం  కూడా వుండేది .. తన విద్యార్ధి బావిష్యతులో మంచి పేరు తెచ్చుకోవాలని , బాధ్యతగా ( responsibility ) తెసుకొని మేము తప్పు పనులు చేస్తుంటే కొట్టి మరి చెప్పే వారు ... కానీ ఇప్పుడు గురువు లు ఎవ్వరు విద్యార్థులను ఒక మాట కానీ చిన్ని దెబ్బగాని  కొట్టకూడదు ... ఒక వేళ   కొడితే తరువాత రోజున వాళ్ళ parents ముందు దోషి లా నిలబడాల్సి వుంటుంది లేదా పిల్లవాడు కొంచం డబ్బు వున్నవాడు అయితే  ఏకంగా మీడియా ముందు కి వెళ్ళాల్సి వస్తుంది , ... ఇంకా గురువులు ఏం  కొడతారు చెప్పండి ??? భయం  తో పాటలు చెప్పుకోవాల్సిందే అంతే ...ఇంక గురువు  శిషులకు బందం ఎలా దృడంగా వుంటుంది చెప్పండి ?????

పిల్లలు అంత క్రురంగా  అలోచించి  అంత పెద్ద తప్పుచేయడానికి  కారణం గురువు చెసిన తప్పా??? లేక ఆ పిల్లాడి తప్పా ???  నాకు తెలిసి ఈ తప్పు పిల్ల వాడిది కాదు ,, గురువుది  అంత కంటే కాదు  ... ముమ్మాటికి పిల్లల తల్లిదండ్రులదే ... పిల్లలు చెడి పోతున్నారని పెద్ద మీటింగ్ లు పెట్టి మీడియా ముందు అందరు మాట్లాడేవారే ... మరి ఎందుకు ఇలా తప్పులు జరుగుతున్నయి .....??? నా పిల్లలు పెద్ద చదువు లు చదివి పెద్ద జాబు చేయాలనీ అందరి  తల్లిదండ్రులు అనుకునే వారె కాని   నైతిక  ( మోరల్)   విలువలు తో పెరగాలి అని అనుకోవడం లేదు....

పిల్లలు  ఉదయం లేగిస్తే tutions  తరువాత స్కూల్ , evening  మళ్ళి  tution  నైట్ వచ్చాక   కంప్యూటర్ గేమ్స్ ... ఇంక పిల్లలకి  నైతిక  విలువలు ( moral values )  ఎలా  తెలుస్తాయీ  ???... ఇంట్లో parents  ( 70%) బాలీవుడ్ , టాలీవుడ్ సెరయాల్స్ చూస్తూ వుంటారు తప్ప ... పిల్లలకి కొన్ని మంచి  విషయాలను కాని , కథలను కాని  చెప్పే బాద్యత ని మరిచిపోయా రు...  పిల్లలకి ఏది మంచో ?? ఏది చెడు ?/ తెలియని మనసు .. మనం  ఏది చెబితే అది వాళ్ళు నమ్ముతారు ... అలా  మనం మంచి విషయాలు చెబితే కచ్చితంగా  పిల్లలు బావిష్యతు లో  మంచి పౌరిడిగా ...మారతాడు ... సెరయాల్స్  కి పెట్టె సమయం మీ పిల్లల మీద పెట్టండి....ఇలాంటి దుర్బాగ్యం మన సంస్క్రతి కి రాకుండా కాపాడు కుందాం... గురువు లను దేవుడితో సమం గా చూదాం... నా ఆత్మ లో సత్య  .  

16, ఫిబ్రవరి 2012, గురువారం

తెలుగు సంవత్సరాలు,ఆయనములు,ఋతువులు,మాసములు,తిధులు



తెలుగు సంవత్సరాలు 60 :
ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద్యూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్ధివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖి, హేవళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద. రాక్షస, నల, పింగళ. కాళయుక్తి, సిద్ధార్ధి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ.

ఆయనములు 2:
ఉత్తరాయణము :
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.
దక్షిణాయణం :
కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.

ఋతువులు 6 :
వసంతం, గ్రీషం, వర్ష, శరదృరుతువు, హేమంత, శిశిర

మాసములు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)

పక్షములు 2 :
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాద్యమి నుంది అమావాస్య వరకు కృష్ణపక్షం.

తిధులు 16 :
పాడ్యమి, విదియ తదియ, వవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య

వారములు 7 :
ఆదివారం - భానువాసరే
సోమవారం - ఇందువాసరే
మంగళవారం - భౌమ్యవాసరే
బుధవారం - సౌమ్యవాసరే
గురువారం - గురువాసరే
శుక్రవారం - భృగువాసరే
శనివారం - స్థిరవాసరే / మందవాసరే

11, ఫిబ్రవరి 2012, శనివారం

కొబ్బరికాయ






మాఇంట్లో  ప్రతి మంగళవారం మా అమ్మానాన్నలు చెరొక కొబ్బరికాయ ని గుడిలో కొడుతుంటారు .. అందులో సగం ఇంటికి తెస్తారు సగం గుడిలో దేవుడికి వదిలేస్తారు …నేను స్కూల్  నుంచి రాగానే  షుగర్  తో కలిపి ఆ సగం కొబ్బరికయని  తినేవాన్ని  ….  అలా అపుడప్పుడు నాతో కూడా కొబ్బరికయని కొట్టించేవారు  … అపుడు నేను చాలా గర్వంగా  feel అయ్యేవాణ్ణి  … ఆ కొబ్బరికాయ ని నేను అందరికి పంచేవాన్ని  ….  నేను  8th క్లాసు  లో  వున్నపుడు మా నాన్నగారు ఒకసారి  city కి తెసుకువెళ్లారు  అపుడు టిఫిన్ చేయడానికి ఉడిపి  హోటల్  కి తెసుకు వెళ్లారు .. ఆర్డర్  చేసిన ఇడ్లి అందులో ను పుట్ట్నాలు మరియు కొబ్బరి చేత్న్ని రాగానే గబగబా తినడం  స్టార్ట్  చేశా … అంతయ్యాక బయటకి వస్తుంటే  .. మాకు ఎదురు పడుతూ ఒకతను సంచి నిండుగా కొబ్బరి తెసుకొని హోటల్   లోపలి కి  వస్తున్నాడు  … అపుడే మా నాన్న గారిని అడిగాను ఈ కొబ్బరి అంత ఎక్కడి నుంచి తెసుకొని వస్తారని  ???? చిన్నా..!!! ఈ కొబ్బరి అంత పక్కనే వున్నా దేవాలయం నుంచి తిసుకోస్తారని  చెప్పారు  … అంటే మిగతా సగం కొబ్బరి కాయలు ఇలా హోటల్  లో  అమ్మేస్త్రారని తెలుసుకొన్నాను ….
అలా  ఎపుడు గుడికి వెళ్ళిన కొబ్బరికాయ కొట్టేవాడిని  … నేను   ఇంటర్మీడియట్  చదువుతున్నపుడు ఒకసారి వేయీ స్థంబాల గుడికి వెళ్లి దేవుడిని దర్శ్హనం చేసుకొని అక్కడ కూడా కొబ్బరికాయ  కొట్టి బయటకి వస్తువున్నాను  …. అక్కడే ఒక పండు ముసలి వయసులో వున్నా ఒక ఆవిడ బిక్షాటన చేస్తుంది  …చూడటానికి చాలా ఆకలి మీదా వున్నట్టు కనిపించింది  …. నానా  దానం చెయి  నానా మీ తల్లిదండ్రులను  ఆ  దేవుడు చల్లగా చూస్తాడు అని అన్నది  … నా దగ్గర వున్నా ఒక రుపాయీ ఇచ్చాను … చల్లగా వుండు  నానా  అంది  … అపుడు ఆ అమ్మ మొహం  లో  కొంచం ఆనందాన్ని గమనిచాను …. ఇంటికి వచ్చి ఎప్పటి  లా గే కొబ్బరికయని  షుగర్  తో కలుపుతున్నాను … కాని నా ఆలోచనంత ఆ బిక్షాటన చేసే అమ్మ మీదే …. ఈ కొబ్బరికాయ  కోట్టకుంటే కనీసం ఇంకో రెండు రూపాయలు అయిన  ఇచేవాడిని అని అనుకున్నాను …..
అప్పుడు నాకు ఒక సందేహం కలిగింది అస్సలు దేవుడికి కొబ్బరికాయ ఎందుకోట్టాలి  ??????పూర్వ కాలం నుంచి వస్తున్నా సంస్క్రతి  … దీనికి ఏదేని  ఒక  scientific reason వుంటుందో అనుకునే వాణ్ణి  …మా నాన్నమ్మ ని అడిగాను అపుడు గుడికి కి వెళ్ళినపుడు  కొబ్బరికాయ కొడితే మంచి ది రా అని చెప్పింది  ???ఎందుకో కొట్టాలో మాత్రం చెప్పలేదు  …. చివరికి పూజారిని అడిగాను ,... కొబ్బరికాయ ని మన మానవ head  కి సమంగా చూస్తారని  కొబ్బరికాయ   మీద  వున్నా పిచు ( fibre ) మన లో వున్నా ఆలోచనలను  , కోరికలకు సమంగా  చూస్తారు అని  కొబ్బరి లోపల  వుండే ఆ తెల్లని పదార్థం ని మన హృదయం తో సమంగా చూస్తారని ,...ఎపుడు అయితే  కొబ్బరికాయ మనం కోడతమో అపుడు ఎలాగాఎతే  పవిత్రం  గా వున్నా నీరు తో పాటు తెల్లని పదార్థం వస్తుందో .. అలాగే మనం కూడా మనలో వున్నా స్వార్ధపు  ఆలోచనలు , కోరికలను పక్కనపెట్టి ఎటువంటి మలినం లేని  పవిత్రమైన హృదయాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పడానికి , అలా అంత పవిత్రం అయింది  కనుక కొబ్బరిని ప్రసాదం గా తెసుకొంటారని చెప్పారు .ఆ పూజారి చెపిన దాంట్లో spirituval  గా బాగానే అనిపించింది కానీ scientific  గా ఏమి అనిపించలేదు.    మన కష్టాలు తిరుతాయో లేదో తేలేదు కానీ ఆ కొబ్బరికాయకు పెట్టె పది రూపాయలతో ఆ గుడి దగ్గర బిక్ష్తన చేసే,.. ఏ పని  చేయలేని  స్థితిలో వున్నా వృద్ధ వయసు వారికీ    ఆ  రోజు పూట అన్నం  లో  మన వంతు గా కొన్ని మెతుకులు ఇచ్చిన  వాళ్ళ మావుతము అనుకోనాను    … అలాగే ఆ పెద్దవాళ్ళ అశిశులు కూడా పొందుతాము … అయీన మానవసేవే మాధవసేవ  అనేకదా మనకు మన గురువులు నేర్పించింది  ….. అందుకే ఇప్పుడు కొబ్బరికాయ ను కొట్టడం మానేసాను ... నా ఆత్మలో సత్య ...!!

8, ఫిబ్రవరి 2012, బుధవారం

ప్రేమ ...!!!!!




ప్రేమ అనే రెండు అక్షరాలే అయీనా ఈ ప్రపంచం మొత్తం దీనిమేదే ఆదారపడివుంది ….. అప్పడే నా ఇంటర్మీడియట్  అయిపొయింది ,కాలి కాలిగా తిరగడం, ఇంట్లో సినిమాలు చుస్తూ కాలం గడుపుతువున్నాను సరిగ్గా ఆ సినిమా లు  చూస్తున్న   సమయం   లో  నాకొక సందేహం వచ్చింది అస్సలు ప్రేమంటే అర్థమేమి టా అని    ??? ఇంకా ఆ  తరువాత వరుస సందేహాలు ...దేనిని ప్రేమాంటారు  ????  దేనిని ఆకర్షనాంటారు  ????ఒకరిని ప్రేమించినపుడు, వారు  తిరిగి  ప్రేమించకపోతే    ఎందుకు ఇంత దారుణంగా behave చేస్తారో ???   న్యూస్ పేపర్ లో చాలాచదివాను   ??? అప్పటివరుకు అమాయకంగా వున్నవారు ఎదుటి వారు  ప్రేమించకపోతే ఎందుకు వారిని చంపే క్రోధం కలుగుతుంది  ??? అస్సలు ఆ  టైం  లో  వారి మెదడు ఎందుకు అలా ఆలోచిస్తుంది    ???? ఎన్నో సినిమాలల్లో చూపించారు ప్రేమ అంటే ఒకమ్మయీ   ఒకబ్బాయీ  మద్య లో వుండే బంధమని  ??? అధినిజమేనా  ???? మరి అన్నాతమ్ముల  , అక్కాచెల్లెల  , తండ్రికొడుకుల  , తల్లిపిల్లల మద్య వున్నది ప్రేమ కదా  ????  confusion   ….……  కాలమే అన్ని నేర్పిస్తుంది అని పెద్దలు అన్నారు  … మరి నాకు ఎందుకు ముందే ఇలాంటి    సందేహాలు వస్తున్నాయీ ????   ఎవరినిఅడగాలి  ??అడిగితీ ఏమనుకుంటారో అని అనుకొనే వాణ్ణి   ….. అప్పటివరకి ఎంతో ఆప్యాయతతో  పెంచిన అమ్మానాన్నలతో ఎలా ఎదురు మా ట్లడతారు???  , ఎలా వదిలి వెలతారు??  ???? ప్రేమ అంత గొప్పద ??/ లేక ఇంత చెడ్డద  ???? confusion confusion  ……

చివరకు ఇన్ని  సందేహాలకు సమాదానం  ఈ సమాజం నుంచే తెలుసుకున్నాను  …. ఈ ఒక్క సమాదానం ద్వార  ఫైన  కలిగిన సందేహాలన్నీ తిరాయీ  …..!!! ప్రేమ అంటే ఏ స్వార్థం లేకుండా క్షమించడం  ……ఒక తల్లి తన బిడ్డలను ఏం చేసినా  ఏ కల్మషం లేకుండా క్షమిస్తుంది  , అన్న తమ్మున్ని  ,భర్త బార్యని   ,బార్య భర్తని  , తండ్రి తన పిల్లల్ని, అలాగే ఒకామ్మయి ఒకాబ్బయిని ,ఒకబ్బాయీ  ఒకామ్మయిని … ఫ్రెండ్స్  మద్య  … మనిషులేకావచ్చు    , జంతువులేకావచ్చు   , లేక మొక్కలేకావచ్చు   ….ఇలా  ఎక్కడఎతే క్షమించుకోవడం ఉంటుందో ఆ  రెండింటి మద్య వున్నా బంధాన్నే ప్రేమ అంటారు  …. ఎప్పుడు అయెతే   క్షమించడం తగ్గిపోతుందో  క్రమంగా ప్రేమ కూడా తగ్గిపోతుంది... అంటే  చవరకు అసలు క్షమించటం లేకుంటే అక్కడ ప్రేమకి చోటేలేదు   …..

ప్రేమ  లో  వున్నా మనతరం అబ్బాయీ అమ్మాయీ కొన్ని పరిస్తితుల వాళ్ళ పెళ్ళి    చేసుకోకపోవచ్చు  … కానీ ఏ స్వార్థం లేకుండా క్షమించడం అనే గొప్ప గుణం అలవాటవుతుంది  …స్వార్థం లేకుండా  క్షమించడం కూడా ఒక్కసారిగా రాదు …మన  job  ( work ) experience లాగా …. దానికి కూడా కొంత  experience అవసరం … ఆ  experience ఏ  ఈ  ప్రేమనుబావం  …..  నా దృష్టిలో  ప్రేమ  failure అన్న మాట లేనే లేదు …..  ప్రేమ ఏప్పటికి ఓడిపోదు …. నా ఆత్మలో సత్య ...!!!