పేజీలు

30, ఏప్రిల్ 2012, సోమవారం

ఏ ఒక్కరు అనాధ అనే బావంతో చనిపోకుడదు


ఈలాంటి వారి గురించి తెలుసుకుంటే మనలో కొంచామయీన మానవత్వపు విలువ తెలుసు కుంటమనే ఉద్దేశం తో అలాగే ఈ సంస్థ  గురించి అందరికి తెలియాలని ఈ  పోస్ట్ రాస్తున్నాను  ....

 

మీరు ఎపుడఎన గాంధీ హాసిటల్ మార్చురీ కాని  ఉస్మానియా  హాసిటల్ మార్చురీ చూసారా ????? రోజుల తరబడి మర్చ్గురిలలో అనాధ మృత దేహాలు కుల్లిపోయీ  వుండటం, .రాసులు గా పడి వుండటం ... చూసారా చివరికి చనిపోయాక కూడా వీరు  భూమికి బారమే అవుతున్నారు ... ఇలాంటి కుళ్ళిపోయిన  మృతదేహాల వలన అసుప్రతి చికిస్సనిమితం  వచ్చిపోయే   వందలాది మంది  రోగులకే కాకా మర్చురిలో పని  చేసే సిబంద్ధికి  , ఆ  పరిసరాలలో నివసించే ప్రజలకు రోగాలు రావడానికి కారణం గా మారు తున్నాయి  .... ఎవరు చేస్తారు వీరికి  దహన సంస్కరణ ??? ..రెక్కలు రాగేనే పెద్దవాళ్ళను వదిలేసే రాక్షస గుండెలు ఈప్పటి రోజుల్లో ఎన్నో చూస్తున్నాము . సొంత కుటుంబికులు అసహించుకోని   వదిలేసినా హ.ఐ.వి , టి .బి తదితర వ్యాధులతో చినిపోయిన వారు ...నా అన్నవాళ్లు లేని వారు .. ఇలా ఎన్నో మృత దేహాలు ....!!!!!

కోతి చని పోతే వంద కోతులు వస్తాయీ  .. కాకి చని పోతే 10  కాకులు  వచ్చి తెసుకేలతాయీ  .. మరి మనిషి చనిపోతే ???? ఆ శవం కుళ్ళి పోయేవారికి ఆ శవం పక్క నుంచే నడుస్తాము  తప్ప ... ఆ శవం గురించి  ఆలోచించము ..

మానవసేవే మాధవ సేవ ... పరోపకారం కొంచం పుణ్యం .. అన్నారు మన పెద్దలు ... కాని ఇప్పుడు 50  % మంది అవకాశం వస్తే పక్కవాడిని దోచుకుందామా  అని చూస్తున్నారు ... ఇంకా 90 % మంది ఈతరులు ఎమయీతే నా కేంతుకులే .. తాను బాగుంటే చాలు అని అనుకునేవాళ్ళే....  సాటి మనిషికోసం అది నిర్జీవం గా పడి వున్నా ఈ మృత దేహాల కోసం ..ఎవ్వరు చేయలేని సాహసానికి వడి  కట్టి .. ఒక స్వార్ధం లేని ఒక గొప్ప వ్యక్తి   ..ఒక రోజు ఒక మృత దేహం ఫోటో తెయడం కోసం వెళ్ళిన ఆ  వ్యక్తి కుళ్ళిపోయిన ఈ మృత దేహాలను చూసి చేలించుపోయాడు ... అతని పేరే రాజేశ్వర రావు వృతి రిత్య ఫోతోగ్రఫేర్.... 

ప్రాణాలతో వున్నా వారికీ పేరు చిరునామా ఎలా వుంటుందో అనదాగా  చనిపోయిన వారికీ కూడా చిరునామా వుండాలని ఏ ఒక్కరు అనాధ అనే బావంతో చనిపోకుడదు అనే ఆలోచనతో  Satya Harishchandra ఫౌండేషన్ ని స్టార్ట్ చేసారు ... 
ప్రబుత్వ ఆస్పత్రి లలో అత్యవసర విబాగాలయందు అనాధలుగా చికిత్స పొందుతున్న రోగోలకు సేవలన్దుస్తుంది ... రోగి కోలుకున్నాక బాధితుల బంధువులు  రాని  పక్షం లో వారిని ఆనాద ఆశ్రమాలలో చేర్పిస్తున్నారు ...

సొంత  కుటుంబికులు వదిలేసినా హ.ఐ.వి , టి .బి తదితర వ్యాధులతో చినిపోయిన వారిని అసహించుకోకుండా మన కుటుంబ సబ్యులలో ఒక వ్యక్తిగా పరిగణిస్తూ .. నేటి యువతీ యువకులు స్వచంధంగా ఈ ఫౌండేషన్ ద్వార ముందుకు వచ్చి వారి భుజస్కందాల ఫై మోసుకొని వెళ్లి స్మశానం లో సాంప్రదాయ భద్దంగా అగ్నికి ఆహుతి చేసి పంచ భుతలలో కలిపేస్తూ వున్నారు ...
 www.unknownbodies.org/  అనే వెబ్ సైట్ లో రోజువారి సమాచారాన్ని నిక్షిప్తపరిచి ప్రజల సందర్శనార్ధం మృతి చెందినా వారి వేలాది ఫోటోలను గత 10 yrs  గా ఫోటో అల్భం ను కూడా ఈ సమస్త పొంధపరిచింది ... 2006  జనవరి నుంచి ఈప్పటి   వరకి 7000  ఫై గా ఆనాద మృత దేహాలను దహనం  చేయడం జరిగింది ... ఈ అల్భం ని maintain  చేయడం ద్వార  గత 5 yrs  నుంచి 3000 ఫై గా బాధిత కుటుంబాల వారు ఆనాద గా చనిపోయిన వారి వివరాలను గుర్తించారు ....దీని వల్లా ఆ కుటుంబ సబ్యులకి ఒక విధం గా వీరు చాలా  సహాయం  చేస్తున్నట్టే ఎందుకంటీ !!! .. ఆ చినిపోయిన కుంటుంబం లో పిల్లలకి ఈ dearth  సర్టిఫికేట్ వల్లా వారి చదువులకి స్కాలర్షిప్ దొరుకుతున్నాయీ ..
ఒక్కపుడు  వీరికి జనం నుంచి కులాలు, మతాలు అంటూ ... చంపుతమంట్టు భెదిరింపులు ఎదుర్యయాయీ ...అయిన వీటిని ఎదుర్కుంటూ 14  yrs  నుంచి సేవ చేస్తూనే వున్నాడు ... రామాయణం లో రాముడి వనవాసం ల ... ఇతని కృషికి సాక్షాతూ రాముడే అని అనిపిస్తుంది ... ఈతనికి తోడు  వున్నా వారు ఎవరో కాదు ... లక్ష్మనుడి   లాంటి సొంత  తమ్ముల్లే వారి పేరు మహేష్ గారు, సాయి కిశోరే గారు   ..    చిన్న చిన్న గా  అతని ఆశయం కొద్ది కొద్ది గా నగరం మొత్తం విస్తరించి రాష్ట్ర ప్రబుత్వం దృష్టికి వెళ్ళింది ....

 ఈ సంస్థ  గురించి పూర్తిగా  తెలుసుకోవలనుకుటే http://www.unknownbodies.org/ వెబ్ సైట్ చుడండి . మానవత్వానికి మరో పేరు అయిన ..    రామలక్ష్మను లాంటి ఇలాంటి అన్నదమ్ములు చేసేది సహాయం కాదు .. సాహసం తో కూడిన ఒక ఉద్యమం ... మానవత్వపు విలువ తెలిపిన  వీరికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుందాము ...

21, ఏప్రిల్ 2012, శనివారం

పసుపు - వేప పేటెంట్ చరిత్ర

ఒక చిన్న అవగాహనా కోసం ఈ పోస్ట్ రాస్తున్నాను .....



పసుపు లేని వంటిల్లు లేదు , పసుపు  లేని చెర్మ సంబంధ మేడిసిన్స్ లేవు , అంతగా  మనకు ఉపయోగ పడుతున్న ఈ పసుపు  పేటెంట్ గురించి అలాగే  ఒక  వ్యక్తి గురించి , ఆ వ్యక్తి చేసిన పోరాటం గురుంచి  మనందరం తెలుసుకోవాలి ....
1993  లో ఇద్దరు physicians ఇండియా కి వచ్చి ఈ పసుపు  వాడకాన్ని  చూసి ఒక 30 -40  పేజీలా డాకుమెంట్స్ రాసి University Of Mississippi కి అప్లై చేసి , U .S  పేటెంట్ కింద ఇది approve  చేయించు కొన్నారు ... ఆ తరువాత ఒక 2  నెలల లోనే 50  లక్షలకి ఫైగ పేపర్స్ ఈ పసుపు మీద u .S  లో పబ్లిష్ అయేనాయీ...పసుపు చర్మ సంబంధ వ్యాధులకు ఉపయోగ పడతాయని చూపించారు ....
ఇపుడు ఇండియా లో తయారు చేసిన చెర్మ సంబందిత  మేడిసిన్స్   u .S  లో ఇంపోర్ట్ చేసుకో కూడదు ... ఒకవేళ చేస్తే అ కంపినీ వాళ్ళు కొంత డబ్బు ఆ ఇద్దరికి ( physicians ) pay  చేయాల్సివుంటుంది ... అప్పుడు u .S  కి ఇంపోర్ట్  చేయాల్సిన మేడిసిన్స్ అన్ని ఆగిపోయాయి .pharmaceutical కంపెనీ లు అన్ని నష్టాల్లో వున్నాయీ . 

అప్పటి CSIR ( Council of Scientific and Industrial Research ) Director-General R.A. మషేల్కర్ గారు u .S కి వెళ్లి , చెర్మ సంబదిత వ్యాధులని  నివారించే 32  పేపర్స్  ని submit  చేసి , ఈ విషయం ఇండియాలో అందరికి తెలుసు అని చెప్పి  ..మీరు  ఇచ్చిన పేటెంట్ లో కొత్తదనం ( novelty మరియు  innovation  ) ఏమి లేదని వాదించాడు ...కానీ u .S  govt  దానికి ఒప్పుకోలేదు .. ఆయన తిరిగి ఇండియాకి వచ్చి పాత  పుస్తకాలూ , ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విషయాలు , వంటల్లో ఎందుకు ఉస్ చేస్తారో?? , ఆడవాళ్లు ఎందుకు పసుపు రాసుకుంటారో??.... గాయం అయెతే మనవాళ్ళు ఈ పసుపును ఎందుకు ఉస్ చేస్తారో ??.. అసలు ఈ పసుపు ని మన వాళ్ళు 5000  yrs  క్రితం నుంచే చర్మ సంబంధ వ్యాధులకు ఉపయోగిస్తున్నారని .. legal గా  ప్రూవే చేసాడు ...అతను ఇలాగా 3  yrs  u .S  పేటెంట్ మీద fight  చేసాడు .... చివరగా 1997  లో కొత్తదనం ( novelty )క్రింద ఆ పేటెంట్ ని u .S  govt  కొట్టిపారేసింది ..
ఇంకో విషయం ఏంటంటే ఇలాగే europe  వాళ్ళు కూడా వేప చెట్టు ( neem  tree ) మీద 1993  లో నే పేటెంట్ తెసుకొన్నారు ... అదే సమయం లోనే europe  మీద కూడా మళ్ళి  ఇతనే  fight  చేసి , ఆ పేటెంట్ ని కూడా కొత్తదనం ( novelty  ) క్రింద తప్పు అని ప్రూవే  చేసి ఆ పేటెంట్ కూడా europe  పేటెంట్ సంస్థ   1997  లో కొట్టిపరేసేలా కృషి చేసాడు ... దీనికి కూడా ౩ yrs   ప ట్టింది ...
అపటినుంచి మన ఇండియన్ pharmaceutical కంపెనీ లు అన్ని లాబాల్లోకి వచ్చాయీ ..మనం కూడా హ్యాపీ గా పసుపు ని  ఉస్ చేసుకోగలుగుతున్నాము ....

మన ఇండియన్ పేటెంట్ law  ప్రకారం ఏ  పేటెంట్ కూడా traditional  knowledge   ని base  చేసుకొని ఉండకుడదు ...    

 ఇంత గొప్ప పని చేసిన   R.A. మషేల్కర్ గారు ఎంతమందికి తెలుసంటారు ????... హాట్స్ ఆఫ్ to  R.A. మషేల్కర్ గారు.... ఆ తరువాత ఈయన కృషి కి  మన ఇండియన్ govt  2000  లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించారు ....  

17, ఏప్రిల్ 2012, మంగళవారం

అవయవా దానం.. ఆలోచించండి ...!!!!

ఈ పోస్ట్ ని నేను కేవలం awareness కోసమే రాస్తున్నాను ..... 


 
పుట్టేటపుడు  ఎం తెచ్చాము ???? ఫైకి  వెళ్ళే టప్పుడు ఎం తెసుకేలతాము ..??? ఏమి తెసుకేల్లము అని మన పెద్దలు చెబుతుంటారు ... కానీ మనం కరెక్ట్ గా  ఆలోచిస్తే  వెళ్ళే టప్పుడు మనతో పాటుగా మన శరీరం  లో  వేరొకరికి ఉపయోగపడే అవయవాలను  తెసుకేలుతున్నాము. 

మన ఒక్క భారత దేశం లోనే సుమారు గా  1 .1  మిలియన్ ప్రజలకు కంటి చూపు లేని వారు  ,౩౦ లక్షల మందికి  మానసిక వికలాంగులుగా .. ౩౦ లక్షల మందికి మాటలు మాట్లాడ రాకపోవడం , .. 15  లక్షల మందికి చెవులు వినబడక పోవడం .. ఇంక కిడ్ని లు పడఎపోయిన వాళ్ళు  , కాలేయం పడఎన వాళ్ళు .., చేతులు , కాల్లు లేని వాళ్ళు ఇలా.. ఇంక ప్రపంచం మొత్తం మీద ఎంత మంది వున్నారో ...??? ఆ దేవుడు మనకి ఏ లోటు లేకుండా అన్ని ఇచ్చాడు ...
మనం చనిపోయాక కూడా వేరే వారికీ ఉపయోగపడే ఈ అవయవాలను మనతో పాటు గా  తెసుకేల్లడం ఎంత వరకి కరెక్ట్ అంటారు ??? 
నేను చని పోయాక నాలో  ఉపయోగపడే అవయవాలన్నీ ఇతరులకు  ( ఉపయోగపడే వారికీ ) ఇవ్వాలని   కోరుకుంటూ  సుమారు గా ( 2 మే 2011 ) సంవత్సర క్రితమే గర్వగ్గా  సంతకం చేశాను . మీరు ఒకసారి ఆలోచించండి ...  నా ఆత్మ లో సత్య 

11, ఏప్రిల్ 2012, బుధవారం

నిస్వార్ధం




ఈ మద్య చాలా  మంది చాలా సందర్బాలలో స్వార్ధం లేని వారు ఈ ప్రపంచం లో ఎవ్వరు లేరని చెబుతున్నారు  .... ఇది నిజమేనా ???   ఒక మిత్రుడు మనకి సహాయం చేస్తే అతను తరువాత మనం  సహాయం  చేస్తామనే స్వార్ధం తోనే సహాయం చేసారని .... చివరికి  కన్న తల్లి కూడా తను సంతోష పడాలనే స్వార్ధం తోనే పిల్లలని పెంచుతున్నారు అని ఇలా  చాలా  చాలా  discussion లు జరిగాయి   ... ఇంతకి ఏది నిజమంటారా ???

మదర్ తెరిస నోబెల్ ప్రైజ్ రావాలనే స్వార్ధం తో సమాజానికి సేవా చేసిన్దంటారా ????
ఆ నాడు సీతమ్మ తల్లి తన పతి అయిన శ్రీ రాముని కోసమని అగ్ని ప్రవేశం చేసిన్దంటారా ????
వారెన్ భాఫేట్ సమాజం లో పేరు కోసమనో  లేక తన సంతోషం కోసమనో తన ఆస్థి లో కొంత బాగాన్ని ఈ సమాజానికి రాసా రంటారా ???
ఏ స్వార్ధం కోరి మన గురువులు మనం ఈ సమజం లో గొప్పగా జీవించాలని చెబుతారు ????
ఏ స్వార్ధం కోరి ఒక మాతృ మూర్తి తన  బిడ్డని 9  నెలలు మోస్తుంది ????
ఒకరు మనకి సహాయం చేసినపుడు ... అతను మన నుంచి స్వార్ధం తో సహాయాన్ని అసిస్తున్నాడని అని  మనం  అనుకోని సహాయం చేస్తామా ??? లేక విశ్వాసం తో సహాయం చేస్తామా ?????? ఇక్కడ  స్వార్ధం అన్న పదాన్ని వాడితే...!! మరి  విశ్వాసం అన్న మాట మన తెలుగు బాష లో ఉండదు కదా ????
రామాయణం లో  విభీషణుడు ధర్మం కోసమని  శ్రీ రాముడి వై పు కి వచ్చాడా ??? లేక తన అన్న రాజ్యం నాకు రావాలనే స్వార్ధం తో శ్రీ రాముడి  వై పు కి వచ్చాడా ??????
చిన్న పిల్ల లు ఏ స్వార్ధం కోరి మన దగ్గరకి వచ్చి టైం spend  చేస్తారు .... ?????
 ఒక వ్యక్తి కి ఆక్సిడెంట్ అయినపుడు మనం వెంటనే హాస్పిటల్ కి తెసుకొని వెళతాము ... ఏ స్వార్ధం కోరి తేసుకో వెళ్ళామంటారు  ....????

govt  సహాయం లేకుండా ఎన్నో సేవా సంస్టలు మన భారత దేశం లో వున్నాయీ ... వాళ్ళు స్వార్థ పరులు అంటారా ....??? లేక నిస్వర్ధపరులు అంటారా ???? నేను ఫైన   చెప్పినవి అందరికి తెసిన కొన్ని ఉదహారణలు చెప్పాను ...  ఇంక మనకు  తెలియని ఎంతో మంది ఏమి ఆశించకుండా ఎన్నో మంచిపనులు చేస్తున్నారు .... మరి వీళ్ళని  ఏమంటారు ??????.
మీరన్నట్టు మొత్తం స్వార్ధమే ఉందనుకుంటే ... నిస్వార్ధం, కృతజ్ఞత ,విశ్వాసం ,ధర్మం,లంచం  అనే పదాలు ఏ భాషలోను వుండకూడదు ....  నా ఆత్మ లో సత్య  

9, ఏప్రిల్ 2012, సోమవారం

బంధువులు ( Relatives ) - బంధాలు





నేను ఆరవ తరగతి లో వున్నపుడు మా అక్కయ్య  పెళ్లి జరిగింది ...  మా అక్కయ్య పెళ్ళి కి  15  రోజుల ముందు నుంచే ఇల్లంతా బంధువులతో నిండి పోయింది ... రోజుకి దాదాపుగా ఒక ౩౦ - 40  మందికి ( బంధువులు / కొంత మంది ఊరిలో ) వంట చేసే వారు ... ఇంట్లో మొత్తం సందడిగా వుండేది ... 10  రోజులు కార్డ్స్ పంచడానికే పట్టేది, అది కూడా రోజు కి ఒక 8  మంది వేరే  వేరు ఊర్లకి వెళ్ళే వారు . పెళ్ళిఅయిపోయాకా ఒక 10  రోజులు బంధువులు ఇంట్లోనే వున్నారు ....నేను  పెరుగుతున్న  కొద్ది   నెమ్మదిగా బంధువులనకు దూరంగా వుండటం అలవాటయింది ..బంధుత్వాలా విలువలు ఏంటో తెలియకుండా పెరిగాను ..... ఇంక ఇపుడు  బంధువులే లేకుండా వుండే స్టేజి కి వచ్చాను  ....అత్తమ్మ ,మామయ్య  ,తాతయ్య ,అమ్మమ్మ ,బావ , చిన్నన్నా , పెద్ద నానా , ... ఈ మాటలనే మరిచిపోయాను ....


 అయిన  బంధువులతో  వుంటే ఎంత ??? లేకుంటే ఎంత ???? ముందు నా తోడ పుట్టిన  ( రక్త సంబంధం ) వారితో బంధాన్ని నిలుపు కుంటే చాలు అనుకున్నాను .... కాని నేను అనుకున్నది తప్పు అని మా అన్నయ్య పెళ్లి కి తెలిసింది ...మార్చి౨౦ ౧౨ (2012  ) లో మా అన్నయ్య పెళ్ళి అయింది , అప్పటి పెళ్ళికి ఈ ప్పటి పెళ్ళికి చాలా తేడాని గమనించాను...౭ ( 7 ) రోజుల్లో పెళ్ళి జరిగిపోయింది ... ౩(3 ) రోజుల్లో పత్రికలు పంచె యడం  .. అది కూడా ఇద్దరే వెళ్లి పంచడం ... ఎందుకంటే ఇపుడు టెక్నాలజీ బాగా  పెరిగింది కదా ... అందరికి ఫోన్ చేసే చెప్పారు ...పెళ్ళి ఇంక 2  రోజులు వున్నా ఇంట్లో చుట్టాలు లేరు .... ఇంక పెళ్ళి తరువాత 3  రోజే కే ఎవ్వరు లేకుండా అందరు వెళ్లి పోయారు...

 దీనికి  ప్రధాన కారణం మేము బంధువులను ఎక్కువగా పట్టిన్చుకోలేకపోవడమే , అలాగే పెళ్ళి ఫంక్షన్ హాల్ లో  కాబట్టి  అందరు కరెక్ట్ గా  ముహూర్తానికి వచ్చి అశేర్వదించి ...విందు చేసి గంటల్లో తిరిగి  వెళ్లి పోయారు ......

      ఇపుడు అందరు ఒక మాట వాడుతున్నారు ... బంధువులు  స్వార్థపరులు అని,   నేను కూడా అలానే నా మెదడులో బలంగా చుచ్చుకోపోయే లాగా అనుకున్నాను .... ఆ చిన్న స్వార్ధపు ఆలోచనతో  , ఈ బంధుత్వా ప్రపంచాన్ని చిన్నదిగా చేసుకోనని బ్రతికాను ..... చివరిగా నా కంటూ రక్త సంబంధం తప్ప వేరే  బంధువులే   లేకుండా వున్నాను .....నేను కూడా ఎంత స్వార్ధం గా అలోచిస్తున్ననో .....

        మన ఈ బారత దేశ సంస్క్రతి లో బంధుత్వాలకి చాల గొప్ప ఆశయం ,  నైతిక విలువతో కూడిన బావం వుంది .... డబ్బు సంపాదించడం కోసమే ఈ బారతదేశం లో వున్నాను  అని అనుకోని  బంధువులతో , సొసైటీ తో బంధాలు లేకుండా నాది నేను బ్రతికేస్తే చాలు అని అనుకుంటే .... రేపు నీ జీతం లో 2  ల క్షల నుంచి 3 ,7 , 9  L ..... అవుతుందే తప్ప ??/.... ఈ బారతదేశ సంస్క్రతి లో వుండి అర్తం లేని వాళ్ళమవుతాము ....డబ్బు సంపాదించడానికే అయెతే వేరే దేశానికి వెళ్లి సంపాదిస్తే దీనికి ఒక 5 -10  రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిం చావచ్చు ... నీ ఇన్వెస్ట్మెంట్ ఈ దేశం లో పెట్టి ఈ దేశ  ఆర్ధిక అబివృద్ధి కి కనీస  సహం చేసిన వాడివి అవుతావు ...... అలా కాకుండా నాకు నేను నా రక్త సంబంధమే అనుకుంటే  రేపు నీకు పుట్టపోయే వాడికి కూడా మనవ బంధాలు ,  నైతిక  విలువలు  తెలియకుండా పెరుగుతాడు... ... నేను చేసిన తప్పుని  సరిదిద్దుకొని ఈ బారత దేశ సంస్క్రతి లో  గర్వంగా బ్రతుకుతాను ...  నా ఆత్మ లో సత్య