పేజీలు

30, మార్చి 2013, శనివారం

నా ( మన ) ఊరు....కవిత

తొలి కోడి కూ త , దేవుడి పాట  తో మేల్కొనేదే  నా ( మన ) ఊరు . 
ముగ్గుల హరివిల్లు తో మూస్త బయ్యేదే  నా ( మన ) ఊరు. 
చంగు చంగు నా ఉప్పొంగే చెరువు , కవ్వించే కోకిల పాటే నా ( మన ) ఊరు.
మేక -గొర్రెల గుంపు , ఆవు- గేదల సమూహమే నా ( మన ) ఊరు.
సాయంత్రం ఎర్రని సంధ్యా వెలుగులో మెరిసేదే నా ( మన ) ఊరు.
చీకటి అయితే తాటికల్ల నీరు, ఇప్ప సారా  సేవించే దే నా ( మన ) ఊరు.
చల్లని వెన్నెల వెలుతురులో హాయిగా నిద్ర పోయేదే నా ( మన ) ఊరు.
తొలకరి చినుకులతో ఆకు పచ్చని  చీ ర దరించేదే నా ( మన ) ఊరు.
వాన జల్లులో కాగితపు పడవలతో అడుకునేదే నా ( మన ) ఊరు.
గాలి శిలను సంగీతం లా మలిచే  గిజిగాడి పాటే  నా ( మన ) ఊరు.
భోగి మంటలతో చలి కాపుకునేదే నా ( మన ) ఊరు.
పాడిపంటలతో ఆనందంగా తులాతుగేదే నా ( మన ) ఊరు.
చల్లని ఫై ర  గాలితో తీయ్యని సంగీతాన్ని వినిపించేదే నా ( మన ) ఊరు.
మర్రి చెట్టు సాక్షి గా తీర్పు ను అంగికరించేదే నా ( మన ) ఊరు.
పండగలకి మామిడి ఆకుల తోరణాలతో ,పిండి వంటలతో నిండి పోయేదే నా ( మన ) ఊరు.
కోడి పంద్యాలు ,ఎడ్ల పంద్యాలకు పోటీగా నిలిచేదే నా ( మన ) ఊరు.
జానపద కళల సమ్మేళనమే  నా ( మన ) ఊరు.
బంధాలు అనుభంధాలు ప్రేమ ఆప్యాయత అనురాగాలతో కలసి ఉండేదే నా ( మన ) ఊరు.

బ్రతుకు తెరువు కోసం రాష్ట్రాలు దేశాలు దాటినా, ఎన్నో పేరు ప్రక్యాతలు సంపాదించినా నీ చిరునామా మాత్రం నీ ఈ ఊరే . కన్న తల్లిని ,పుట్టిన ఈ మట్టిని మరిచిపోకు నేస్తమా ...!      ....... నా ఆత్మలో సత్య 


5, జులై 2012, గురువారం

పెళ్లి ఫోటోల ఫోజులు ....!!!


ఈ పోస్ట్ రాయడానికి నేను ముమ్మాటికి అర్హుడను కాను ...మా క్లాసు ఫ్రెండ్ పెళ్లి ఫోటో లు పేస్ బుక్ లో చూసినపుడు  నా మనసులో మాటను కొందరికైనా  తెలియాలని మరియు  ఈ సంస్కృతి మీద ప్రేమ తో రాస్తున్నాను .


అప్పటి కాలం లో  పెళ్లి ఎలా జరిగేది ? అని మా నానమ్మ కి అడిగాను మా అక్కయ్య  పెళ్లి అయినతరువాత ... మా నానమ్మ పెళ్లి 15 రోజులు జరిగిందని , ఆ 15 రోజులు ల  గురించి వివరంగా చెప్పింది ..... ఇ ప్పుడు వున్నా ఈ బిజీ ప్రపంచంలో 2 రోజులు జరిగిందంటే అదే చాలా ఎక్కువ అనుకుంటున్నాము ... ఆ రెండు రోజుల్లో ఏ గొడవ కాకుంటే చాలురా దేవుడా అనుకున్ట్టున్నాము ....

పాత కాలం లా 15 రోజులు పెళ్లి చేసుకోవడానికి మన దగ్గర అంత సమయం లేకపోవచ్చు లేక అంత ఓపిక లేకపోవచ్చు ... కానీ  జరగబోయే కార్యం పద్ధతి గా జరుపుకుందాం ....

ఇప్పటి  పెళ్లి కొడుకు  - పెళ్లి కూతురు ... ముహూర్తాలు చాదస్తాలండి  అంటున్నారు ( ముక్యం గా చదువు కున్నవారు ) ... అస్సలు ముహూర్తాలు ఎందుకు పెడతారో? ... నక్షత్రాలు ( జాతకాలు ) ఎందుకు చూడాలి అని ఎదురు ప్రశ్న ఒకటి పెద్దల మోహన పడేస్తారు ...జీల కర్ర - బెల్లం , తాళి , తలంబ్రాలు , ఇలా  ప్రతి గట్టం గురించి పెళ్ళికి ముందే తెలిసి వుండాలి...

.., ముహూర్త సమయానికి వారి ఇద్దరి నక్షత్రాలకి మనస్సులు  ఏకీకృతం అయ్యే అవకాశం వస్తుంది ( from astrology ) , ఇంకా జీలకర బెల్లం కలిపి బాగా నూరి అరచేతిలో పెట్టుకొని అవతలి వారి తల ( మెదడు  నరం ) ఒకరికి ఒకరు పట్టుకున్నపుడు విధ్య్తయస్కంత శక్తి వల్ల  ( from electro- magnetic theory  einstein ) మనం మనసులో ఏమనుకుంటామో  అది మనం చనిపోయేంత వారికీ ఎప్పటికి గుర్తుకొస్తూనే వుంటుంది . ఆ సమయం లో చెప్పే మంత్రాలని శ్రద్ధ గా విని పంతులు చెప్పినట్లుగా చెబితే అపుడు నీ మనసులో ఆ మాటలు ఒక శీలా మేధ రాతలా వుండి పోతాయి   .. తరువాత దాంపత్య జీవితము  లో గొడవలు రాకుండా వుంటుంది ....

కాని ఇప్పటి పెళ్ళిలలో జీల కర్ర - బెల్లం పెట్టినపుడు కుడా కామెరా వైపు చూస్తున్నారు ... ఆ సమయం లో పంతులు చెప్పే మాటలకి కాని , మనసులో దృడం గా ఒక మాట కాని అనుకోవడం లేదు , ఇంకా ఎలాగా కలుస్తాయి వారి మనసులు ??/. 
ఇంకా తలంబ్రాలు పోసుకొనే విషయానికి వస్తే , ముత్యాలు పగడాలు కలిపినా పసుపు బియ్యాన్ని ఒకరి మీద ఒకరు మూడు సార్లు పోసుకుంటారు .. ఈ సమయం లో పురోహితుదు , సంతానబివ్రుద్ధి పశుసంరుద్ధి మాగన సమృద్ధి అంటూ  ఆశిర్వదిస్తాడు .. సరిగ్గా అదే సమయం లో ముక్కోటి దేవతలు వచ్చి వధువరులను ఆశీర్వదిస్తారు ... ఆ సమయంలో కూడా ఇ లా ఫోటో ఫోజు కోసమని చేయి ఇ లా పెట్టి , అలా పెట్టి ఆడుకోవడం ధీని వాళ్ళ ముక్కోటి దేవతల అశేషులు పొందలేకపోతున్నారు ...మాంగళ్యం  కట్టేతపుడు కూడా ఇదే  వరస ... అందుకీ ఇప్పుడు సమాజం లో విడాకులు  లక్షలాది గా పెరిగి పోయాయి ...

ఫోతోగ్రఫెర్  ప్రతిదానికి ఇటు చుడండి , ఒక్క నిముషం మరొక్కసారి అని చెప్పి అతను ఫొటోస్ తెస్తూనే వుంటాడు ... ఎందుకంటే తరువాత ఫొటోస్ బాగా రాలేదనుకో తనని నిందిస్తారని , కాబ్బట్టి అతని బయం అతనికి  , అయిన ఇ పుడు ప్రతేకం గా ఫొటోస్ కోసమని ఒక సిస్టం పెట్టుకొన్నాము గా అదే రిసెప్షన్ ... ఏ ఫోజు లో కావాలంటే ఆ ఫోజులో దిగ్గచ్చుగా..... 

అప్పటిలో బార్య బార్త  ఇద్దరు సర్దుకో పోయి సంతోషం గా వుండే వారు ... అందుకే  అపుడు విడాకులు అన్న మాట లేదు ... బార్య తప్పు చేస్తే వుద్ధరించుకునే వాడు బార్త ... అంతే కానీ ఈ వంట బాగాలేదు ఇది బాగాలేదు అనే వాడు కాదు భర్త ... కానీ ఇ పుడు ఎవరి వక్తిత్వం వారిది , సర్దుకు పోదాం అనే ఆలోచన తగ్గింది అందుకే ఇపుడు విడాకుల సంఖ్య  దారుణంగా పెరిగిపోయింది .....


 పెళ్లి ఒక పద్ధతి గా  శుబం కలిగే విధం గా  జరుపోకొనే లా ఆలోచించండి .. ఫోతోగ్రఫేర్ కి ముందే చెప్పండి , పెళ్లి జరిగేటప్పుడు దిస్త్రుబ్ ( disturb ) చేయద్దని , ఫొటోస్ ఎలా వస్తే అలానే తీయమని .. అవసరమైతే ఫొటోస్ తి యకపోయినా పరవాలేదని చెప్పండి  .... ఆలోచించండి .....నా ఆత్మలో సత్య .....!!!

6, మే 2012, ఆదివారం

సత్యమేవ జేయతే .....!!!! మీరు చుడండి , మీ పిల్లలకి చూపించండి


సత్యమేవ జేయతే .....!!!! మీరు  చుడండి , మీ పిల్లలకి చూపించండి 

http://www.youtube.com/watch?v=MXg6Usdjl5c 


కష్టం,బాధ వేరొకరితో పంచుకుంటే కొంచం బాధ తీరుతుందంటారు... .సంతోషం వస్తే వేరొకరితో ఆ సంతోషాన్ని పంచుకుంటే రెట్టిపు అవుతుందంటారు మన పెద్దలు ... ఇది ప్రక్టికాల్  ( practical ) గా  కూడా నిరుపితమవుతుంది  .... అలాంటి  కష్టాలను నాతో పంచుకోండి అని ఈపుడు అమీర్ ఖాన్  గారు మన దగ్గరికి వచ్చేసారు ... నేను సమాజాన్ని మొతాన్ని మార్చలేను ... నేను ఈ భారత దేశంలో  పుట్టినందుకు  నా దేశం లో ప్రజలు ఏ   సమస్యలతో  బాధ పడుతున్నారో ... తెలుసుకొని .అందరికి తెలియచేయాలి  అన్న ఆలోచనతో  ఈ ప్రోగ్రాం స్టార్ట్  ... చేస్తున్నాను అని  ....ఆ కష్టం ,వాళ్ళు నాతో పంచుకున్నపుడు ( టీవీ చూస్తున్న , మనకి అలాగే ఆ ప్రోగ్రాం లో పర్తిసిపతే  చేసే వారికీ ) కొంచం ఆ బాధ తగ్గిన్నట్టు గా  ఉంటుందని , అలాగే ఆ సమస్య ఎవరి వళ్ళ వస్తుంది అని విశ్లేషించడానికి ( కుంటుంబ సభ్యులా ? , రాజకీయ నాయకుల?  లేక ఈ సమాజమేనా? )  దానికి కారణమైన   వారిని  ..( వారు సమాజం లో ఒక మాములు మనిషి కానివ్వండి లేదా ఒక రాజకీయ నాయకులూ  కానీవండి , లేదా స్వయం గ ప్రభుత్వమే కానివ్వండి.... ) అక్కడే  ప్రశ్న వేయడానికి .... అలాగే  కొంతమంది గొప్ప నిస్వార్ధ వక్తుల స్వచంద సంస్థ లను గురించి కూడా మనకు .... తెలియచేయాలనీ ..సమాజం లో  ఒక చిన్న మార్పు కోసం చేసే చిన్న ప్రయత్నం  ... అమీర్ ఖాన్ 

మన బారత దేశం లో  వున్నా వివిధ ప్రాంతాల ప్రజల సమస్యలు మనకు తె లీ దు ... ఈ ప్రోగ్రాం ద్వారా మనకి ఒక అవగాహన కలిగిస్తున్నారు ...ఇంత  గొప్ప  position lo వున్నా అతను ఇలా  దేశం గురించి తెలుసుకోని మనకు తెలియ  చేయడం అనేది చాలా  గొప్ప పని  ... ఇందులో  సినిమా లో లాగా  డైలాగ్ లు రాసుకొని చెప్పడం కాదు ..ఒక జోర్నోలిస్ట్ లా   ప్రశ్నలువేయాలి .. అప్పటికప్పుడు  మాట్లాడాలి ... సమాజానికి ఉపయోగ పడేధీ గా మాట్లాడాలి ...సమాజానికి ప్రశించే విధంగా మాట్లాడాలి నిజంగా  ఇది  ఒక సాహసమే !!!  ఇలాంటి గొప్ప  ప్రోగ్రాం ని స్టార్ట్ చేసినందులకు మీకు హత్స్ ఆఫ్ ( hats off )సర్ ... 

అమీర్ సర్ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవతం కావాలని ఆ దేవుణ్ణి  కోరు కుంటున్నాను ....
మీరందరు కూడా ఈ ప్రోగ్రాం ని చుడండి ( every Sunday 11:00am to 12:30pm ( star plus ))  ఈ ప్రోగ్రాం ని  మీ పిల్లలకి చూపిస్తే వారికీ  , మన దేశ విలువలు, మానవత్వ విలువలు , నయితిక  ( మోరల్ ) విలువలు తెలుస్తాయని నా ఉద్దేశం  . అవసరమయితే ఈ ప్రోగ్రాం మిద  సంభాషణ మీ ఇంట్లో కుటుంభ సభ్యులతో చర్చించుకోండి, ఎందుకంటే నేటి బాలలే రేపటి భారత దేశాన్ని నడిపిచేవారు ...... అందుకే ఈ పోస్ట్ రాస్తున్నాను .
జై హింద్ ,
జై భరత్ , సత్యమేవ జేయతే .....!!!!

30, ఏప్రిల్ 2012, సోమవారం

ఏ ఒక్కరు అనాధ అనే బావంతో చనిపోకుడదు


ఈలాంటి వారి గురించి తెలుసుకుంటే మనలో కొంచామయీన మానవత్వపు విలువ తెలుసు కుంటమనే ఉద్దేశం తో అలాగే ఈ సంస్థ  గురించి అందరికి తెలియాలని ఈ  పోస్ట్ రాస్తున్నాను  ....

 

మీరు ఎపుడఎన గాంధీ హాసిటల్ మార్చురీ కాని  ఉస్మానియా  హాసిటల్ మార్చురీ చూసారా ????? రోజుల తరబడి మర్చ్గురిలలో అనాధ మృత దేహాలు కుల్లిపోయీ  వుండటం, .రాసులు గా పడి వుండటం ... చూసారా చివరికి చనిపోయాక కూడా వీరు  భూమికి బారమే అవుతున్నారు ... ఇలాంటి కుళ్ళిపోయిన  మృతదేహాల వలన అసుప్రతి చికిస్సనిమితం  వచ్చిపోయే   వందలాది మంది  రోగులకే కాకా మర్చురిలో పని  చేసే సిబంద్ధికి  , ఆ  పరిసరాలలో నివసించే ప్రజలకు రోగాలు రావడానికి కారణం గా మారు తున్నాయి  .... ఎవరు చేస్తారు వీరికి  దహన సంస్కరణ ??? ..రెక్కలు రాగేనే పెద్దవాళ్ళను వదిలేసే రాక్షస గుండెలు ఈప్పటి రోజుల్లో ఎన్నో చూస్తున్నాము . సొంత కుటుంబికులు అసహించుకోని   వదిలేసినా హ.ఐ.వి , టి .బి తదితర వ్యాధులతో చినిపోయిన వారు ...నా అన్నవాళ్లు లేని వారు .. ఇలా ఎన్నో మృత దేహాలు ....!!!!!

కోతి చని పోతే వంద కోతులు వస్తాయీ  .. కాకి చని పోతే 10  కాకులు  వచ్చి తెసుకేలతాయీ  .. మరి మనిషి చనిపోతే ???? ఆ శవం కుళ్ళి పోయేవారికి ఆ శవం పక్క నుంచే నడుస్తాము  తప్ప ... ఆ శవం గురించి  ఆలోచించము ..

మానవసేవే మాధవ సేవ ... పరోపకారం కొంచం పుణ్యం .. అన్నారు మన పెద్దలు ... కాని ఇప్పుడు 50  % మంది అవకాశం వస్తే పక్కవాడిని దోచుకుందామా  అని చూస్తున్నారు ... ఇంకా 90 % మంది ఈతరులు ఎమయీతే నా కేంతుకులే .. తాను బాగుంటే చాలు అని అనుకునేవాళ్ళే....  సాటి మనిషికోసం అది నిర్జీవం గా పడి వున్నా ఈ మృత దేహాల కోసం ..ఎవ్వరు చేయలేని సాహసానికి వడి  కట్టి .. ఒక స్వార్ధం లేని ఒక గొప్ప వ్యక్తి   ..ఒక రోజు ఒక మృత దేహం ఫోటో తెయడం కోసం వెళ్ళిన ఆ  వ్యక్తి కుళ్ళిపోయిన ఈ మృత దేహాలను చూసి చేలించుపోయాడు ... అతని పేరే రాజేశ్వర రావు వృతి రిత్య ఫోతోగ్రఫేర్.... 

ప్రాణాలతో వున్నా వారికీ పేరు చిరునామా ఎలా వుంటుందో అనదాగా  చనిపోయిన వారికీ కూడా చిరునామా వుండాలని ఏ ఒక్కరు అనాధ అనే బావంతో చనిపోకుడదు అనే ఆలోచనతో  Satya Harishchandra ఫౌండేషన్ ని స్టార్ట్ చేసారు ... 
ప్రబుత్వ ఆస్పత్రి లలో అత్యవసర విబాగాలయందు అనాధలుగా చికిత్స పొందుతున్న రోగోలకు సేవలన్దుస్తుంది ... రోగి కోలుకున్నాక బాధితుల బంధువులు  రాని  పక్షం లో వారిని ఆనాద ఆశ్రమాలలో చేర్పిస్తున్నారు ...

సొంత  కుటుంబికులు వదిలేసినా హ.ఐ.వి , టి .బి తదితర వ్యాధులతో చినిపోయిన వారిని అసహించుకోకుండా మన కుటుంబ సబ్యులలో ఒక వ్యక్తిగా పరిగణిస్తూ .. నేటి యువతీ యువకులు స్వచంధంగా ఈ ఫౌండేషన్ ద్వార ముందుకు వచ్చి వారి భుజస్కందాల ఫై మోసుకొని వెళ్లి స్మశానం లో సాంప్రదాయ భద్దంగా అగ్నికి ఆహుతి చేసి పంచ భుతలలో కలిపేస్తూ వున్నారు ...
 www.unknownbodies.org/  అనే వెబ్ సైట్ లో రోజువారి సమాచారాన్ని నిక్షిప్తపరిచి ప్రజల సందర్శనార్ధం మృతి చెందినా వారి వేలాది ఫోటోలను గత 10 yrs  గా ఫోటో అల్భం ను కూడా ఈ సమస్త పొంధపరిచింది ... 2006  జనవరి నుంచి ఈప్పటి   వరకి 7000  ఫై గా ఆనాద మృత దేహాలను దహనం  చేయడం జరిగింది ... ఈ అల్భం ని maintain  చేయడం ద్వార  గత 5 yrs  నుంచి 3000 ఫై గా బాధిత కుటుంబాల వారు ఆనాద గా చనిపోయిన వారి వివరాలను గుర్తించారు ....దీని వల్లా ఆ కుటుంబ సబ్యులకి ఒక విధం గా వీరు చాలా  సహాయం  చేస్తున్నట్టే ఎందుకంటీ !!! .. ఆ చినిపోయిన కుంటుంబం లో పిల్లలకి ఈ dearth  సర్టిఫికేట్ వల్లా వారి చదువులకి స్కాలర్షిప్ దొరుకుతున్నాయీ ..
ఒక్కపుడు  వీరికి జనం నుంచి కులాలు, మతాలు అంటూ ... చంపుతమంట్టు భెదిరింపులు ఎదుర్యయాయీ ...అయిన వీటిని ఎదుర్కుంటూ 14  yrs  నుంచి సేవ చేస్తూనే వున్నాడు ... రామాయణం లో రాముడి వనవాసం ల ... ఇతని కృషికి సాక్షాతూ రాముడే అని అనిపిస్తుంది ... ఈతనికి తోడు  వున్నా వారు ఎవరో కాదు ... లక్ష్మనుడి   లాంటి సొంత  తమ్ముల్లే వారి పేరు మహేష్ గారు, సాయి కిశోరే గారు   ..    చిన్న చిన్న గా  అతని ఆశయం కొద్ది కొద్ది గా నగరం మొత్తం విస్తరించి రాష్ట్ర ప్రబుత్వం దృష్టికి వెళ్ళింది ....

 ఈ సంస్థ  గురించి పూర్తిగా  తెలుసుకోవలనుకుటే http://www.unknownbodies.org/ వెబ్ సైట్ చుడండి . మానవత్వానికి మరో పేరు అయిన ..    రామలక్ష్మను లాంటి ఇలాంటి అన్నదమ్ములు చేసేది సహాయం కాదు .. సాహసం తో కూడిన ఒక ఉద్యమం ... మానవత్వపు విలువ తెలిపిన  వీరికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుందాము ...

21, ఏప్రిల్ 2012, శనివారం

పసుపు - వేప పేటెంట్ చరిత్ర

ఒక చిన్న అవగాహనా కోసం ఈ పోస్ట్ రాస్తున్నాను .....



పసుపు లేని వంటిల్లు లేదు , పసుపు  లేని చెర్మ సంబంధ మేడిసిన్స్ లేవు , అంతగా  మనకు ఉపయోగ పడుతున్న ఈ పసుపు  పేటెంట్ గురించి అలాగే  ఒక  వ్యక్తి గురించి , ఆ వ్యక్తి చేసిన పోరాటం గురుంచి  మనందరం తెలుసుకోవాలి ....
1993  లో ఇద్దరు physicians ఇండియా కి వచ్చి ఈ పసుపు  వాడకాన్ని  చూసి ఒక 30 -40  పేజీలా డాకుమెంట్స్ రాసి University Of Mississippi కి అప్లై చేసి , U .S  పేటెంట్ కింద ఇది approve  చేయించు కొన్నారు ... ఆ తరువాత ఒక 2  నెలల లోనే 50  లక్షలకి ఫైగ పేపర్స్ ఈ పసుపు మీద u .S  లో పబ్లిష్ అయేనాయీ...పసుపు చర్మ సంబంధ వ్యాధులకు ఉపయోగ పడతాయని చూపించారు ....
ఇపుడు ఇండియా లో తయారు చేసిన చెర్మ సంబందిత  మేడిసిన్స్   u .S  లో ఇంపోర్ట్ చేసుకో కూడదు ... ఒకవేళ చేస్తే అ కంపినీ వాళ్ళు కొంత డబ్బు ఆ ఇద్దరికి ( physicians ) pay  చేయాల్సివుంటుంది ... అప్పుడు u .S  కి ఇంపోర్ట్  చేయాల్సిన మేడిసిన్స్ అన్ని ఆగిపోయాయి .pharmaceutical కంపెనీ లు అన్ని నష్టాల్లో వున్నాయీ . 

అప్పటి CSIR ( Council of Scientific and Industrial Research ) Director-General R.A. మషేల్కర్ గారు u .S కి వెళ్లి , చెర్మ సంబదిత వ్యాధులని  నివారించే 32  పేపర్స్  ని submit  చేసి , ఈ విషయం ఇండియాలో అందరికి తెలుసు అని చెప్పి  ..మీరు  ఇచ్చిన పేటెంట్ లో కొత్తదనం ( novelty మరియు  innovation  ) ఏమి లేదని వాదించాడు ...కానీ u .S  govt  దానికి ఒప్పుకోలేదు .. ఆయన తిరిగి ఇండియాకి వచ్చి పాత  పుస్తకాలూ , ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విషయాలు , వంటల్లో ఎందుకు ఉస్ చేస్తారో?? , ఆడవాళ్లు ఎందుకు పసుపు రాసుకుంటారో??.... గాయం అయెతే మనవాళ్ళు ఈ పసుపును ఎందుకు ఉస్ చేస్తారో ??.. అసలు ఈ పసుపు ని మన వాళ్ళు 5000  yrs  క్రితం నుంచే చర్మ సంబంధ వ్యాధులకు ఉపయోగిస్తున్నారని .. legal గా  ప్రూవే చేసాడు ...అతను ఇలాగా 3  yrs  u .S  పేటెంట్ మీద fight  చేసాడు .... చివరగా 1997  లో కొత్తదనం ( novelty )క్రింద ఆ పేటెంట్ ని u .S  govt  కొట్టిపారేసింది ..
ఇంకో విషయం ఏంటంటే ఇలాగే europe  వాళ్ళు కూడా వేప చెట్టు ( neem  tree ) మీద 1993  లో నే పేటెంట్ తెసుకొన్నారు ... అదే సమయం లోనే europe  మీద కూడా మళ్ళి  ఇతనే  fight  చేసి , ఆ పేటెంట్ ని కూడా కొత్తదనం ( novelty  ) క్రింద తప్పు అని ప్రూవే  చేసి ఆ పేటెంట్ కూడా europe  పేటెంట్ సంస్థ   1997  లో కొట్టిపరేసేలా కృషి చేసాడు ... దీనికి కూడా ౩ yrs   ప ట్టింది ...
అపటినుంచి మన ఇండియన్ pharmaceutical కంపెనీ లు అన్ని లాబాల్లోకి వచ్చాయీ ..మనం కూడా హ్యాపీ గా పసుపు ని  ఉస్ చేసుకోగలుగుతున్నాము ....

మన ఇండియన్ పేటెంట్ law  ప్రకారం ఏ  పేటెంట్ కూడా traditional  knowledge   ని base  చేసుకొని ఉండకుడదు ...    

 ఇంత గొప్ప పని చేసిన   R.A. మషేల్కర్ గారు ఎంతమందికి తెలుసంటారు ????... హాట్స్ ఆఫ్ to  R.A. మషేల్కర్ గారు.... ఆ తరువాత ఈయన కృషి కి  మన ఇండియన్ govt  2000  లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించారు ....  

17, ఏప్రిల్ 2012, మంగళవారం

అవయవా దానం.. ఆలోచించండి ...!!!!

ఈ పోస్ట్ ని నేను కేవలం awareness కోసమే రాస్తున్నాను ..... 


 
పుట్టేటపుడు  ఎం తెచ్చాము ???? ఫైకి  వెళ్ళే టప్పుడు ఎం తెసుకేలతాము ..??? ఏమి తెసుకేల్లము అని మన పెద్దలు చెబుతుంటారు ... కానీ మనం కరెక్ట్ గా  ఆలోచిస్తే  వెళ్ళే టప్పుడు మనతో పాటుగా మన శరీరం  లో  వేరొకరికి ఉపయోగపడే అవయవాలను  తెసుకేలుతున్నాము. 

మన ఒక్క భారత దేశం లోనే సుమారు గా  1 .1  మిలియన్ ప్రజలకు కంటి చూపు లేని వారు  ,౩౦ లక్షల మందికి  మానసిక వికలాంగులుగా .. ౩౦ లక్షల మందికి మాటలు మాట్లాడ రాకపోవడం , .. 15  లక్షల మందికి చెవులు వినబడక పోవడం .. ఇంక కిడ్ని లు పడఎపోయిన వాళ్ళు  , కాలేయం పడఎన వాళ్ళు .., చేతులు , కాల్లు లేని వాళ్ళు ఇలా.. ఇంక ప్రపంచం మొత్తం మీద ఎంత మంది వున్నారో ...??? ఆ దేవుడు మనకి ఏ లోటు లేకుండా అన్ని ఇచ్చాడు ...
మనం చనిపోయాక కూడా వేరే వారికీ ఉపయోగపడే ఈ అవయవాలను మనతో పాటు గా  తెసుకేల్లడం ఎంత వరకి కరెక్ట్ అంటారు ??? 
నేను చని పోయాక నాలో  ఉపయోగపడే అవయవాలన్నీ ఇతరులకు  ( ఉపయోగపడే వారికీ ) ఇవ్వాలని   కోరుకుంటూ  సుమారు గా ( 2 మే 2011 ) సంవత్సర క్రితమే గర్వగ్గా  సంతకం చేశాను . మీరు ఒకసారి ఆలోచించండి ...  నా ఆత్మ లో సత్య