చేలు మధ్యలో వున్నా మట్టి రోడ్ నుంచి బస్సు వస్తుంది . మా ఊరికి అడుగు పెట్టగానే ( బస్సు స్టాప్ దగ్గర ) ఒక రావి చెట్టు కనిపిస్తుంది ...అక్కడ చూసిన కాకి ఇంటి వరకి అరుచుకుంటూ ఒక 10 నిముషాలు ముందే వుండేది .. ఎవరయినా బంధువులు వస్తే ముందు చెంబు తో నీళ్ళు ఇచ్చి కాళ్ళని కడుక్కోమని చెప్పెవాళ్ళము ... కదా !!!!
ఇపుడు ఇంట్లో వాళ్ళే సరిగా ఇంటికి రావటం లేదు ఇంకా బంధువుల గురించి చెప్పనక్కరలేదు ...
ఆ కాకి కోసం ఆలపిస్తూ ఒక చిన్ని కవిత ....
నల్లా నల్లాని రంగు గల దానవే ఓ కాకి !
ఫైరులన్ని కలసి పాట పాడేనే నీ పాట కోసం ఓ కాకి !
మా ఊరి రావి చెట్టు రాగం తెసేనే నీ రాగం కోసం ఓ కాకి !
ముంగ్గిట్లో ముగ్గెమో మొఖమెట్లో పెట్టె నీ ముఖo కోసం ఓ కాకి !
అర చెంబుమో అలిగి పోయెనే నిను చూడటం కోసం ఓ కాకి !
అరుగుల చెవులన్ని ఎదురు చూసేనే నీ మాటల కోసం ఓ కాకి !
కనీసం పండగల కయినా రాకపోతివెమే మా ఊరి కోసం ఓ కాకి !
నువ్వు ఎట్లా మరచితివే మా ఊరిని ఓ కాకి !
నిజంగానే నువు నల్లా నల్లాని రంగు గల దానవేనే ఓ కాకి ..... !!!
నా ఆత్మలో సత్య .... !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి