పేజీలు

29, మే 2013, బుధవారం

ఓ కాకి కవిత


మన ఇంటి ( పల్లెటూరు ) దగ్గర ఏదేని  ఒక కాకి వచ్చి అరుస్తే ఆ రోజు మన ఇంటికి ఎవరో చుట్టాలు ( బంధువులు ) వస్తున్నారని  మన పెద్దలు చెప్పేవారు .... 

చేలు మధ్యలో వున్నా మట్టి రోడ్  నుంచి బస్సు వస్తుంది . మా ఊరికి అడుగు పెట్టగానే ( బస్సు స్టాప్ దగ్గర ) ఒక రావి చెట్టు కనిపిస్తుంది ...అక్కడ చూసిన కాకి ఇంటి వరకి అరుచుకుంటూ ఒక 10 నిముషాలు ముందే వుండేది .. ఎవరయినా బంధువులు వస్తే ముందు చెంబు తో నీళ్ళు ఇచ్చి కాళ్ళని కడుక్కోమని చెప్పెవాళ్ళము  ... కదా  !!!!
ఇపుడు ఇంట్లో వాళ్ళే సరిగా ఇంటికి రావటం లేదు ఇంకా బంధువుల గురించి చెప్పనక్కరలేదు ... 
ఆ కాకి కోసం ఆలపిస్తూ ఒక చిన్ని కవిత .... 


నల్లా నల్లాని రంగు గల దానవే ఓ కాకి !
ఫైరులన్ని కలసి పాట పాడేనే నీ పాట కోసం  ఓ కాకి !
మా ఊరి రావి చెట్టు రాగం తెసేనే నీ రాగం కోసం  ఓ కాకి !
ముంగ్గిట్లో ముగ్గెమో మొమెట్లో  పెట్టె నీ ముఖo కోసం ఓ కాకి !
అర చెంబుమో  అలిగి పోయెనే నిను చూడటం కోసం  ఓ కాకి !
అరుగుల చెవులన్ని ఎదురు చూసేనే నీ మాటల కోసం  ఓ కాకి !
కనీసం పండగల కయినా  రాకపోతివెమే మా ఊరి కోసం  ఓ కాకి !
నువ్వు ఎట్లా మరచితివే మా ఊరిని  ఓ కాకి !
నిజంగానే నువు నల్లా నల్లాని రంగు గల దానవేనే  ఓ కాకి  ..... !!!
                                                                                                                  నా ఆత్మలో సత్య .... !!
  

28, మే 2013, మంగళవారం

జపాన్ అనుబవాలు ....


ఇది నా చివరి రోజు జపాన్ లో. జపాన్ గురించి నా అనుభవాలను తెలియజేయాలని ఈ పోస్ట్ రాస్తున్నాను ...



జపాన్ లో  బతకాలంటే విరి బాష ( జపనీస్ ) వచ్చి వుండాలి  లేకపోతే చాలా కష్టం . ఇంత చిన్న దేశం అది సముద్రం చుట్టురా .. ఎపుడు భూకంపాలు వస్తాయో ? ఎపుడు సముద్రం మింగేస్తుందో ? ఎవ్వరికి తెలీదు . అలంటి భయం ఇక్కడ ఎవ్వరి దగ్గర గమనిచినట్టుగా లేదు .

ఇక్కడ మనుషులు చాలా సాఫ్ట్ . సహాయం చేసే స్వబావం కలవారు ...  వీరు పని అంటే ప్రాణం ఇస్తారు. పని చేయకపోతే ఇక అంతే . ఎంత పద్ధతి గా వుంటారో చెప్పనవసరం లేదు .. ప్రతిది తన సొంత వస్తువు లా చూసుకుంటారు . 3 సంవత్సరాల పిల్లల నుంచి 90  సంవత్సరాల ముసలి వాళ్ళ వరికి , ప్రెసిడెంట్ నుండి పేద వాడి వరకు అందరు రూల్స్ ప్రకారం వెళతారు , చావా నయినా  చస్తారు గాని రూల్స్ ని అతిక్రమించారు ...

ఇంకా సంస్క్రతి విషయానికి వస్తే పెద్దగా ఏమి అనిపించదు ...  అంతా ఫాస్ట్ ...పిల్లలకి ఒక 18  సంవత్సరాలు వచ్చేవరకి బాగా పెంచుతారు .. తరువాత ఇంకా పిల్లలే చూసుకోవాలి ... ఇంకా 5 రోజులు బాగా పని చేస్తారు .. వీకెండ్స్ లో ఫుల్ పార్టీ లు ...  non - veg  ఫుల్ గా తింటారు .. veg అసలు చాల చాలా తక్కువ .. ఒక్క  veg  తినే వాళ్ళు ఎవ్వరు వుండరు ...

షాపింగ్ మాల్ విషయానికి వస్తే ఇక్కడ  50% షాప్స్ ఉమెన్స్,గూడ్స్   25% ( మెయిన్ గా ఆటోమోటివ్ , ఎలక్ట్రికల్ ) ,15% పిల్లలకి ( i - pad ( LKG  ,UKG పిల్లలకి )  ,  వీడియో గేమ్స్ , టాయ్స్ ) 10% మెన్స్  కి సంబందిచినవి వుంటాయి ...

ఇంకా అబివృద్ధి విషయానికి వస్తే అందరికి తెలిసిన విషయమే ప్రపంచం లోనే మూడవ స్థానం  లో వుంది , ప్రతి దగ్గర sensors వున్నయి ..  మైండ్ బ్లోయింగ్ అండి , హీరోషిమా ఆగిందా అటోం బాంబ్ వస్తే అని ఒక పాటలో అన్నారు ,... అది ఎలా సాధ్యమా అని అనిపిచింది ముందు ... కానీ వీళ్ళ dedication ,commitment  and unity చూసాక అర్తం అయింది ...  ఇక్కడ బుల్లెట్ ట్రైన్స్ వాటి connectivity అలాగే మెట్రో ట్రైన్స్ వాటి connectivity చాల చాలా బాగున్నాయి .. ఎక్కడ వీళ్ళు comfort ని ఎక్కువ గా కోరుకుంటారు అందుకే ఇక్కడ మనుషుల కన్నా మెషిన్ లకే ఎక్కవ పని వుంటుంది , రోబో లు , సేన్సోర్స్ .. ఇలా  అంత ఆటోమేటిక్ గానే  ... టోక్యో ...   ప్రపంచం లోనే  costliest సిటీ .. ఆ బిల్డింగ్స్ చూడాలి ... అంతే మైండ్ బ్లోయింగ్ ... మాటల్లో చెప్పలేక పోతున్న ..!!!!!!! నాకు ఇప్పటికి ఒక వుంది , వెళ్ళు ఇంత టెక్నాలజీ ని ఎలా వచ్చిందా అని .. ఎందుకంటే వెళ్ళు ప్రపంచానికి అంతగా టచ్ లో లేరు ,అంటే outsourcing లేదు ...  ఇంగ్లీష్ రాదు కాబట్టి వేరే కంట్రీ బుక్స్ ఫాలో అవ్వరు .. ఇంకా ఎలా ??? ఒక్క ఈ టెక్నాలజీ తోనే ఇ పుడు ప్రపంచం లో 3 స్థానం లో వుంది ... వీళ్ళు export చేసేది automotive మరియుఎలాక్ట్రికాల్ goods .. ఇక్కడ natural resource ఏమి లేవు ... భూకంపాలు ,సునామీలు తప్ప ...  ?

నా జీవితం జపాన్ trip  ఒక మంచి అనుబవం గా బావిస్తూ ... నా ఆత్మ లో సత్య 



21, ఏప్రిల్ 2013, ఆదివారం

అమ్మ ప్రేమ ని వెతకండి కారణాలను వెతకకండి....


ఈ మధ్య చాలా వ్యక్తుల విషయం లో గమనిస్తున్నాను ... అందుకె  ఈ పోస్ట్ రాస్తున్నాను ..... 

మన చిన్నపుడు మనం వద్దు అని అన్నా  కూడా వినకుండా  వెంట పడి  మరీ  అన్నం  తినిపించేది  అమ్మ... ఇప్పుడు   అదే అమ్మని వెంట పడి  మరీ  వద్దు అనుకోని  అమ్మ పెంచిన  రెక్కలతోనే రాష్ట్రాలు , దేశాలు దాటి పోతున్నాము .... పాపం పిచ్చి అమ్మ దానిలో స్వార్థం వుందని తెలుసుకోలేకపోయింది .... నా కొడుకు చాలా గొప్పవాడు అయ్యడు ... వాడి కాళ్ళ మిద వాడు నిలబడుతున్నాడు అని అంతులేని సంతోషాన్ని పొందుతుంది ... కాని ఎం చేస్తాం ఆ సంతోషాన్ని పంచుకోడానికి మనం అమ్మ దగ్గర లేము కదా .... 
కొత్తగా జాబు లో చేరాము కదా ఎన్నో ఒడి దొడుగులు , చాలీ చాలని జీతం, ఇంకా అమ్మ ని మన దగ్గరికి ఎలా తెసుకోస్తము ? కుదరదు కదా !... అని ఒక కారణం ,,,,,,సెలవులు వస్తే   మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి కదా ఫ్రెండ్స్ తో ఫుల్ గా తిరగాలి  ఇది ఇంకో కారణం  ...  ..అలా  ఒక రెండు సంవత్సరాలు గడిచిపోయాయి .... ఈ  రెండు సంవత్సరాలలో ఒక 6 - 12 సార్లు ఇంటికి వెళ్ళి వుంటాము ... మనం ఇంటికి వెళితే ఇంట్లో అమ్మ పిండి వంటలతో ఫుల్ busy గా వుంటుంది మరి మనం రాజులం కదా ఎంతో కష్టపడుతున్నాం కదా ....  నువ్వు ఇంటికి వెళితే అమ్మ ఎంతో సంతోషం తో ప్రేమ - ఆప్యాయత ల తో అన్ని రెడీ చేస్తుంది ...ఉదయం 5 కి లేచి అన్ని చేస్తుంది ... ఆ రెండు రోజులు అమ్మ కి విశ్రాంతి ఉండధనుకో  ... అలా  రెండు సంవత్సరాలు గడుస్తాయి ...

తరువాత పెళ్ళి  గోల అమ్మ కి ఎక్కడలేని భయం మంచి అమ్మాయి మా వాడికి దొరుకుతుందో లేదో అని... మొత్త నికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేస్తారు ... ఇంకా ఆ తరువాత చెప్పనవసరం లేదు కారణాలకి కొదవ లేదు  .. కొత్తగా పెళ్ళి అయింది కదా మిమ్మల్ని మీరు అర్ధం  చెసుకోడానికి ఒక సంవత్సరం పడుతుంది కదా ... అమ్మ ని ఒక్కసారి కూడా సినిమా కి తెసుకుపోడు కానీ చేసుకున్న అమ్మాయికి వారానికి ఒక సినిమా ...! అపుడు ఇంకా అమ్మగారింటి కంటే అత్త గారింటికే ఎక్కువగా వెళుతుంటారు ... పెళ్ళి  కి ముందు నెలకి 5-10k  పంపేవారు ఇపుడు పెళ్ళి  అయింది కదా... అవి కూడా మానేస్తున్నాము ... ఇప్పుడు ఇంకొకరిని పోషించాలి కదా మరి ... పిచ్చి అమ్మ మీరు సంతోషం గా వుండాలని , ఒక మనువడిని ఇవ్వాలని మొక్కని దేవుడు వుండడు  .... 




నువ్వు ఇంటికి వెళ్లినపుడల్లా అమ్మ ఎంత కష్టపడుతుందో ఆలోచించావా ? ... నీకు ఇప్పుడు 25 yr  వచాయి కానీ ఒక్కసారి అయినా ఆలోచించావా ? లేదు . .. ఫుల్ గా  తినడం పనే ..!...  నువ్వు  5 రోజులు  కస్టపడి పని చేసి నందులకే  2 రోజులు విశ్రాంతి తెసుకొంట్టున్నావు...  .  మరి అమ్మ నువ్వు కడుపులో ఉన్నపటి నుంచి పని చేస్తూనే  వుంది, అది కూడా నీ కులా   డబ్బుల కోసం కాదు ప్రేమ కోసం  .... తనకి నీ మీద వున్నా ప్రేమ ని పెంచుకోవడం కోసం ...ఫ్రీ  గా దొరుకుతుంది కదా అందుకీ పెద్ద పట్టింపులు  లేవు  మనకు  .... 

ఇంటికి ఎందుకు వెళ్ళ  లేదు అంటే ఏదో ఒక కారణం చెబుతారు ...నాకు ఆ పని వుంది ఈ పని వుంది ఇంకా నేను కెరీర్ లో పయికి  రావాలని కష్టపడుతున్నా ... ఇలా ఏదో ఒక కారణం చెబుతారు .. 
చిన్నపుడు నీకు జ్వరం వస్తే రాత్రంతా తన వళ్ళో  నిన్ను పడుకోబెట్టుకొని నీ తల మీద  వున్నా  తడి గుడ్డని ఎప్పటి  కప్పుడు మారుస్తూ బాధపడుతూ వుండేది ....  మరి ఇప్పుడు  అమ్మ కి జ్వరం వస్తే   నీ బాధ ని, ప్రేమ ని ఫోన్ లో చెప్పుకుంటావు కనబరుస్తావు తప్ప అమ్మ కి టాబ్లెట్ వేసి ఏదయినా  వంట చేసి తిన్పించలేవు ?కనీసం హాస్పిటల్ కి కూడా తెసుకోపోలేవు ... ఒకసారి ఆలోచించు ఒకవేళ నువ్వే  దగ్గర వుండి  అన్ని  చూసుకుంటే అమ్మ ఎంత సంతోషిస్తుందో .. అమ్మ ప్రేమ కి నీ ప్రేమ తోడయితే అమ్మకి  నిజంగా అంతులేని ఆనందమే కదా ... 
అమ్మ ప్రేమను పొందడానికి , అమ్మ ప్రేమను పంచుకోవడానికి ప్రయతించండి... సమయం దొరికించు కొండి  అమ్మ తో గడపడానికి ...  

మనలో ఎంతో మంది నేను అమ్మని బాగానే చుసుకుంటున్నాను అని అపుహ పడేవాళ్ళు ఒకసారి ఆలోచించండి అమ్మ ప్రేమ ని వెతకండి కారణాలను వెతకకండి... నేను ఏమైనా తప్పు గా రాస్తే క్షమించండి ....
అమ్మ నన్ను క్షమించు నేను కూడా అందులో ఒకడిని ...  

ఈ అనంత విశ్వం లో సరి తుగాలేనిది , స్వార్ధం లేనిదీ ఈ అమ్మ ప్రేమ ఒక్కటే ... 
అమ్మ ప్రేమ గురించి మాట్లడటానికి ఏ వాక్కు లేదు .. దేవుడా తర్వాత జన్మలో మా అమ్మ కి నేనే  తల్లి కావాలని మనస్స్పుర్తిగా కోరుకొంటున్నాను ...... నా ఆత్మ లో సత్య 

11, ఏప్రిల్ 2013, గురువారం

ఉగాది జ్ఞాపకాలు ....


ఉగాది యుగానికి ( సంవత్సరం) ఆది ... అంటే సంవత్సరానికి మొదలు .... నా జీవితం లోని  ఒక ఉగాది రోజు ( చిన్నప్పటి ) ...... 
వసంతకాలనికి తొలి క్షణాలు .....!!! ఇంట్లో అందరూ  ఉదయం 4 గంటలకి లేచే వాళ్ళము  ... ఇంటిని అంత నీటితో కడిగి , తల స్నానం చేసే వాళ్ళము ... దేవుడి రూం లో అమ్మ దీపం వెలిగించాకా ... గడ్డపార , గొడ్డలి, చేతి పార ని నీటి తో  కడిగి  వాటికీ కుంకుమ పసుపు పెట్టె  వాడిని , అదే సమయం లో మా నాన్న ఎడ్లని నీటి తో కడిగేవారు ... 
అన్నయ్య ఎడ్ల ని  అలంకరణ చేసేవాడు ... 

అంత అయ్యాక ఇంట్లో దేవుడికి నమస్కారం చేసి  గొడ్డలి , పార ని నేను పట్టుకునే వాడిని ,గడ్డపార ,కొబ్బరి కాయని  అన్నయ్య  పెట్టుకునే వాడు .... అన్నయ్య ఈ రోజు పంచకట్టుకునే వాడు ... నాన్న నాగలిని , తాడుతో  ఎడ్ల ని  కట్టేవాడు .... అప్పటికి 5:00 అవుతూ వుండేది ...ఆ ఎడ్లకి పూజలు  చేసి ఈ సంవత్సరం మా పొలం పనులలో తోడుగా  వుండాలని దండం పెట్టుకునే వాళ్ళము ... అమ్మ ఎదురుగా వచ్చి అందరి పాదాలు తడిసే లా నీళ్ళు పోసి క్షేమంగా వెళ్లి రమ్మని స్వాగతం చేసేది ....  చీకటిలోనే పొలం ( చేను )దగ్గరికి వెళ్లే వాళ్ళము   ... కోడి కుడా అప్పటికి కుయధు .... 

అలా  అంత ఉదయాన్నే నుదుటి మీద పెద్ద బొట్టు ( తిలకం ) పెట్టుకుని  కొత్త బట్టలు వేసుకొని ..తలకి రుమాలు కట్టుకొని . గడ్డపార భుజం మిధ పెట్టుకొని  వసంత గాలిని ఆస్వాదిస్తూ చేనికి వెళ్లే వాళ్ళము ..... 
నాన్న చెనులొ నాగలి కట్టేవారు ... ఒక సంత్సరం నేను , ఒక సంవత్సరం అన్నయ్య ఆ కొబ్బరి కాయని కొట్టి భూమాతని ( నేలని ) క్షమించు అని చెప్పి, ఈ సంవత్సరం పంట బాగా పండేలా చూడామని  ఆ నేల్లమ్మకి  దండం పెట్టుకొని తొలి సాలు దున్నడం మొదలు పెట్టేవాళ్ళము  ...అలా 5 రౌండ్స్ వెళ్ళే వాళ్ళము ...  పార తో  చేనులో వున్నా ఒక 5 చిన్న మొక్కలను తేసేవాళ్ళము  .... అప్పటికి 6 : 00 అయ్యేది .. సూర్యోదయం కాకముందే  తిరిగి  ఇంటికి చేరుకునే వాళ్ళము .... 



ఆ తరువాత సైకిల్ మిద బయటకి వెళ్లి మామిడి ఆకులూ తెచ్చే వాడిని, వాటి తో పాటుగా  మామిడి కాయలను  కూడా తెచ్చే వాడిని , అన్నయ్య వేప పువ్వు వేప ఆకులూ తెచ్చేవాడు ... అమ్మ బంతి పూలతో మాలలు చేసేది ... మామిడి ఆకులతో నేను దరువాజ గుమ్మం  ని అలంకరిచేవాడిని .. అమ్మ పూలతో అలంకరించేది ... 

అప్పటికి 8:00 అవుతుండేది .అ మ్మ వేడిగా టీ చేసి ఇచ్చేది  .... ఉగాది పచ్చడి  చేయడానికి నాన్న చింత పండుని కుండలో ( కొత్త కుండ) వేసి నీళ్ళు  పోసి అందులో, పంచదార  బెల్లం వేసి బాగా కలిపేవారు  , వేపపువ్వుని ,మామిడి ముక్కలను,కొబ్బరి పొడి , కొంచం ఉప్పు ,కొంచం పప్పు,కొంచం కారం   అందులో వేసి బాగా కలిపేవారు .. అప్పటికి అమ్మ భక్షాలు రెడీ చేసే వారు ...... చుట్ట-ఆకులను కప్పులు గా చేసి ... అందులో ఉగాది పచ్చడిని పోసేవారము , భక్షాలను  దేవుడి కి పూజా చేసేటప్పుడు ప్రసాదంగా చూపించే వాళ్ళము  , కొబ్బరి కాయని అన్నయ్య కొట్టే వాడు ... 

దేవుడి కి పూజ చేసే సమయం లో మా నానమ్మ ని పిలిచే వాణ్ణి ... పూజ అయిపోయాక మా అమ్మ నాన్న ల దగ్గర ఆశీర్వచనాలు  తీసుకొనే  వాడిని ... తరువత.. ఒక 2 గ్లాసుల ఉగాది పచ్చడి ,నెయ్యితో భక్షాలను తినేవాడిని ...ఇంక ఈ ఉగాది  పచ్చడిని , మా బందులని , ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిఛి  ఇచ్చేవాళ్ళము... అప్పటికి 12 అవుతుండేది ... పప్పు తో బిక్ష ( భోజనం ) చేసి ... ఊరి  గుడి  దగ్గరకి వెళ్లేవాళ్ళము ... అక్కడ వూరు వూరు  అంత వచ్చే వారు ... పంతులు ఈ సంత్సరం పంచాంగం గురించి చెప్పే వారు ... ఈ సంవ త్సరం వర్షాలు ఎలా పడతాయే? , పంటలు ఎలా పండుతయే? .. వూరు ఎలా వుంటుంది? ...ఇలా అన్ని చెప్పే వారు చివరిలో అందరు వాళ్ళ వాళ్ళ పంచాంగం గురించి అడిగే వారు .... పంతులు రాశులను బట్టి చెప్పేవారు ... నా రాశి  కి ఆదాయం ఎంత వుంటుంది , మా అన్నయ్య రాశి  కి ఎంత వుంటుంది అని తెలుసుకొని ఇంటికి వచ్చి అందరికి చెప్పే వాడిని ... ఆ రోజు మనం ఎలా వుంటే సంవత్సరం మొత్తం అలానే ఉంటామని చెప్పే వారు , అందుకె అబద్ధాలు చెప్పేవాడిని కాదు , సంతోషం గా వుండే వాడిని ...... 

నిజం గా జీవితం లో ఒక గొప్ప రోజు ఈ ఉగాది రొజు..... కొత్త సంత్సరానికి స్వాగతం పలుకుతూ ... నా ఆత్మ లో సత్య  



30, మార్చి 2013, శనివారం

నా ( మన ) ఊరు....కవిత

తొలి కోడి కూ త , దేవుడి పాట  తో మేల్కొనేదే  నా ( మన ) ఊరు . 
ముగ్గుల హరివిల్లు తో మూస్త బయ్యేదే  నా ( మన ) ఊరు. 
చంగు చంగు నా ఉప్పొంగే చెరువు , కవ్వించే కోకిల పాటే నా ( మన ) ఊరు.
మేక -గొర్రెల గుంపు , ఆవు- గేదల సమూహమే నా ( మన ) ఊరు.
సాయంత్రం ఎర్రని సంధ్యా వెలుగులో మెరిసేదే నా ( మన ) ఊరు.
చీకటి అయితే తాటికల్ల నీరు, ఇప్ప సారా  సేవించే దే నా ( మన ) ఊరు.
చల్లని వెన్నెల వెలుతురులో హాయిగా నిద్ర పోయేదే నా ( మన ) ఊరు.
తొలకరి చినుకులతో ఆకు పచ్చని  చీ ర దరించేదే నా ( మన ) ఊరు.
వాన జల్లులో కాగితపు పడవలతో అడుకునేదే నా ( మన ) ఊరు.
గాలి శిలను సంగీతం లా మలిచే  గిజిగాడి పాటే  నా ( మన ) ఊరు.
భోగి మంటలతో చలి కాపుకునేదే నా ( మన ) ఊరు.
పాడిపంటలతో ఆనందంగా తులాతుగేదే నా ( మన ) ఊరు.
చల్లని ఫై ర  గాలితో తీయ్యని సంగీతాన్ని వినిపించేదే నా ( మన ) ఊరు.
మర్రి చెట్టు సాక్షి గా తీర్పు ను అంగికరించేదే నా ( మన ) ఊరు.
పండగలకి మామిడి ఆకుల తోరణాలతో ,పిండి వంటలతో నిండి పోయేదే నా ( మన ) ఊరు.
కోడి పంద్యాలు ,ఎడ్ల పంద్యాలకు పోటీగా నిలిచేదే నా ( మన ) ఊరు.
జానపద కళల సమ్మేళనమే  నా ( మన ) ఊరు.
బంధాలు అనుభంధాలు ప్రేమ ఆప్యాయత అనురాగాలతో కలసి ఉండేదే నా ( మన ) ఊరు.

బ్రతుకు తెరువు కోసం రాష్ట్రాలు దేశాలు దాటినా, ఎన్నో పేరు ప్రక్యాతలు సంపాదించినా నీ చిరునామా మాత్రం నీ ఈ ఊరే . కన్న తల్లిని ,పుట్టిన ఈ మట్టిని మరిచిపోకు నేస్తమా ...!      ....... నా ఆత్మలో సత్య