పేజీలు

11, ఏప్రిల్ 2013, గురువారం

ఉగాది జ్ఞాపకాలు ....


ఉగాది యుగానికి ( సంవత్సరం) ఆది ... అంటే సంవత్సరానికి మొదలు .... నా జీవితం లోని  ఒక ఉగాది రోజు ( చిన్నప్పటి ) ...... 
వసంతకాలనికి తొలి క్షణాలు .....!!! ఇంట్లో అందరూ  ఉదయం 4 గంటలకి లేచే వాళ్ళము  ... ఇంటిని అంత నీటితో కడిగి , తల స్నానం చేసే వాళ్ళము ... దేవుడి రూం లో అమ్మ దీపం వెలిగించాకా ... గడ్డపార , గొడ్డలి, చేతి పార ని నీటి తో  కడిగి  వాటికీ కుంకుమ పసుపు పెట్టె  వాడిని , అదే సమయం లో మా నాన్న ఎడ్లని నీటి తో కడిగేవారు ... 
అన్నయ్య ఎడ్ల ని  అలంకరణ చేసేవాడు ... 

అంత అయ్యాక ఇంట్లో దేవుడికి నమస్కారం చేసి  గొడ్డలి , పార ని నేను పట్టుకునే వాడిని ,గడ్డపార ,కొబ్బరి కాయని  అన్నయ్య  పెట్టుకునే వాడు .... అన్నయ్య ఈ రోజు పంచకట్టుకునే వాడు ... నాన్న నాగలిని , తాడుతో  ఎడ్ల ని  కట్టేవాడు .... అప్పటికి 5:00 అవుతూ వుండేది ...ఆ ఎడ్లకి పూజలు  చేసి ఈ సంవత్సరం మా పొలం పనులలో తోడుగా  వుండాలని దండం పెట్టుకునే వాళ్ళము ... అమ్మ ఎదురుగా వచ్చి అందరి పాదాలు తడిసే లా నీళ్ళు పోసి క్షేమంగా వెళ్లి రమ్మని స్వాగతం చేసేది ....  చీకటిలోనే పొలం ( చేను )దగ్గరికి వెళ్లే వాళ్ళము   ... కోడి కుడా అప్పటికి కుయధు .... 

అలా  అంత ఉదయాన్నే నుదుటి మీద పెద్ద బొట్టు ( తిలకం ) పెట్టుకుని  కొత్త బట్టలు వేసుకొని ..తలకి రుమాలు కట్టుకొని . గడ్డపార భుజం మిధ పెట్టుకొని  వసంత గాలిని ఆస్వాదిస్తూ చేనికి వెళ్లే వాళ్ళము ..... 
నాన్న చెనులొ నాగలి కట్టేవారు ... ఒక సంత్సరం నేను , ఒక సంవత్సరం అన్నయ్య ఆ కొబ్బరి కాయని కొట్టి భూమాతని ( నేలని ) క్షమించు అని చెప్పి, ఈ సంవత్సరం పంట బాగా పండేలా చూడామని  ఆ నేల్లమ్మకి  దండం పెట్టుకొని తొలి సాలు దున్నడం మొదలు పెట్టేవాళ్ళము  ...అలా 5 రౌండ్స్ వెళ్ళే వాళ్ళము ...  పార తో  చేనులో వున్నా ఒక 5 చిన్న మొక్కలను తేసేవాళ్ళము  .... అప్పటికి 6 : 00 అయ్యేది .. సూర్యోదయం కాకముందే  తిరిగి  ఇంటికి చేరుకునే వాళ్ళము .... 



ఆ తరువాత సైకిల్ మిద బయటకి వెళ్లి మామిడి ఆకులూ తెచ్చే వాడిని, వాటి తో పాటుగా  మామిడి కాయలను  కూడా తెచ్చే వాడిని , అన్నయ్య వేప పువ్వు వేప ఆకులూ తెచ్చేవాడు ... అమ్మ బంతి పూలతో మాలలు చేసేది ... మామిడి ఆకులతో నేను దరువాజ గుమ్మం  ని అలంకరిచేవాడిని .. అమ్మ పూలతో అలంకరించేది ... 

అప్పటికి 8:00 అవుతుండేది .అ మ్మ వేడిగా టీ చేసి ఇచ్చేది  .... ఉగాది పచ్చడి  చేయడానికి నాన్న చింత పండుని కుండలో ( కొత్త కుండ) వేసి నీళ్ళు  పోసి అందులో, పంచదార  బెల్లం వేసి బాగా కలిపేవారు  , వేపపువ్వుని ,మామిడి ముక్కలను,కొబ్బరి పొడి , కొంచం ఉప్పు ,కొంచం పప్పు,కొంచం కారం   అందులో వేసి బాగా కలిపేవారు .. అప్పటికి అమ్మ భక్షాలు రెడీ చేసే వారు ...... చుట్ట-ఆకులను కప్పులు గా చేసి ... అందులో ఉగాది పచ్చడిని పోసేవారము , భక్షాలను  దేవుడి కి పూజా చేసేటప్పుడు ప్రసాదంగా చూపించే వాళ్ళము  , కొబ్బరి కాయని అన్నయ్య కొట్టే వాడు ... 

దేవుడి కి పూజ చేసే సమయం లో మా నానమ్మ ని పిలిచే వాణ్ణి ... పూజ అయిపోయాక మా అమ్మ నాన్న ల దగ్గర ఆశీర్వచనాలు  తీసుకొనే  వాడిని ... తరువత.. ఒక 2 గ్లాసుల ఉగాది పచ్చడి ,నెయ్యితో భక్షాలను తినేవాడిని ...ఇంక ఈ ఉగాది  పచ్చడిని , మా బందులని , ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిఛి  ఇచ్చేవాళ్ళము... అప్పటికి 12 అవుతుండేది ... పప్పు తో బిక్ష ( భోజనం ) చేసి ... ఊరి  గుడి  దగ్గరకి వెళ్లేవాళ్ళము ... అక్కడ వూరు వూరు  అంత వచ్చే వారు ... పంతులు ఈ సంత్సరం పంచాంగం గురించి చెప్పే వారు ... ఈ సంవ త్సరం వర్షాలు ఎలా పడతాయే? , పంటలు ఎలా పండుతయే? .. వూరు ఎలా వుంటుంది? ...ఇలా అన్ని చెప్పే వారు చివరిలో అందరు వాళ్ళ వాళ్ళ పంచాంగం గురించి అడిగే వారు .... పంతులు రాశులను బట్టి చెప్పేవారు ... నా రాశి  కి ఆదాయం ఎంత వుంటుంది , మా అన్నయ్య రాశి  కి ఎంత వుంటుంది అని తెలుసుకొని ఇంటికి వచ్చి అందరికి చెప్పే వాడిని ... ఆ రోజు మనం ఎలా వుంటే సంవత్సరం మొత్తం అలానే ఉంటామని చెప్పే వారు , అందుకె అబద్ధాలు చెప్పేవాడిని కాదు , సంతోషం గా వుండే వాడిని ...... 

నిజం గా జీవితం లో ఒక గొప్ప రోజు ఈ ఉగాది రొజు..... కొత్త సంత్సరానికి స్వాగతం పలుకుతూ ... నా ఆత్మ లో సత్య  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి